నల్లబెల్లి, జూలై 16 : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్రీ బస్సులతో కిరాయిలు లేక అప్పులబాధతో ఆటోడ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో గురువారం చోటుచేసుకున్నది.
మృతుడి కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. ఖానాపూర్ మండలం అయోధ్యనగర్‌కు చెందిన ఆటోడ్రైవర్ పుప్పాల దేవేందర్ (35) నల్లబెల్లి మండలం శనిగరం సమీపంలో 365 జాతీయరహదారి పక్కన చెట్టుకు ఉరివేసుకుని మృతిచెందాడు.