నేడు కొత్త ఈహెచ్ఎస్ పథకం ప్రారంభం.. నిధులపై ట్రస్ట్ బోర్డుకు పూర్తి అధికారాలు
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కొత్త ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్(ఈహెచ్ఎస్)ను శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనున్న ది. ఈ నెల 15న డిజిటల్ హెల్త్ కార్డులు ఇస్తామని ఇదే తేదీ నుంచి ఉచిత వైద్య సేవలు ప్రారంభిస్తామని చెప్పిన ప్రభుత్వం ముందు రోజు సాయంత్రం వాయిదా వేసిన విషయం తెలిసిందే. అప్పటికే ప్రభుత్వం మే, జూన్ జీ తాల్లో నుంచి 1.5శాతాన్ని ప్రీమియం రూ పంలో కట్ చేసుకోవడంతో ఉద్యోగులు, పెన్షనర్లలో ఆందోళన నెలకొన్నది.
- స్కీమ్ అమలుకు కొత్త పాలకమండలి
- మార్గదర్శకాలు లేకుండానే ఉత్తర్వులు
హైదరాబాద్, జూలై 16(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కొత్త ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్(ఈహెచ్ఎస్)ను శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనున్నది. ఈ నెల 15న డిజిటల్ హెల్త్ కార్డులు ఇస్తామని ఇదే తేదీ నుంచి ఉచిత వైద్య సేవలు ప్రారంభిస్తామని చెప్పిన ప్రభుత్వం ముందు రోజు సాయంత్రం వాయిదా వేసిన విషయం తెలిసిందే. అప్పటికే ప్రభుత్వం మే, జూన్ జీ తాల్లో నుంచి 1.5శాతాన్ని ప్రీమియం రూ పంలో కట్ చేసుకోవడంతో ఉద్యోగులు, పెన్షనర్లలో ఆందోళన నెలకొన్నది. ఉద్యోగ సంఘా లు సైతం ప్రభుత్వం తీరుపై మండిపడ్డాయి. దీంతో ఎట్టకేలకు సర్కార్ కొత్త ఈహెచ్ఎస్ స్కీమ్ను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చే సింది.
అలాగే ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ పా లకమండలిని పునర్వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇకపై పాలకమండలి ఈహెచ్ఎస్ పథకానికి సంబంధించి అన్ని అధికారులను వినియోగిస్తుందని తెలిపింది. పథకం అమలు, పరిపాలన, నిర్వహణ, ఆర్థిక వ్యవహారాలు, పర్యవేక్షణ తదితర బాధ్యతలను బోర్డు నిర్వహించనున్నది. నిధుల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం, చట్టబద్ధత తప్పనిసరిగా పాటించాలని ట్రస్ట్ బోర్డుకు ఆదేశాలు జారీ అయ్యాయి.
సీపీఎస్ ఉద్యోగుల పరిస్థితి ఏంటి?
ప్రభుత్వ ఉత్తర్వుల్లో దవాఖానలు, మార్గదర్శకాలు లేవు. ఏయే వ్యాధులకు వర్తిస్తుంద న్న స్పష్టత లేదు. బేసిక్ పే, బేసిక్ పెన్షన్ అని ప్రభుత్వం మెన్షన్ చేసింది.. మరి రిటైర్మెంట్ తర్వాత వీళ్లు ఏ కేటగిరిలోకి వస్తారో తేల్చలే దు. ఉద్యోగ విరమణ ఆరోగ్యభద్రత ఉన్న ట్టా? లేదా? అనే అంశంలో స్పష్టత లేదు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

