
కృష్ణకాలనీ, నవంబర్ 3 : ప్రముఖ నటుడు ఆర్ నారాయణమూర్తి తీసిన సినిమా రైతుల సంక్షేమం కోసం తీసిన సినిమా అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఊర్వశి థియేటర్లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులతో కలిసి ఎమ్మెల్యే గండ్ర, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి రైతన్న సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నదాతల సంక్షేమం కోసం నారాయణమూర్తి తీసిన సినిమాను తామంతా టికెట్ కొనుక్కుని చూశామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు వ్యతిరేక చట్టాను తీసివేయాలని నారాయణమూర్తి సినిమా తీయడం సంతోషమన్నారు. రైతన్న సినిమాలో కేంద్ర ప్రభుత్వం రైతులకు చేస్తున్న అన్యాయాలను కళ్లకు కట్టినట్టు చూపించారన్నారు. ఇప్పటికైనా రైతుల బాధలను తెలుసుకు రైతు వ్యతిరేక చట్టాలను తీసేయకుంటే బీజేపీకి రైతుల ఉసురుతాకుందన్నారు. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతు బీమా, రైతు రుణమాఫీ, పంట పెట్టుబడి, ఉచిత కరంటు, కాళేశ్వరం ప్రాజెక్టును సినిమాలో చూపించింనందుకు నారాయణమూర్తికి కృతజ్ఞతలు తెలిపారు.
ఎమ్మెల్యే గండ్రకు కృతజ్ఞతలు : నారాయణమూర్తి
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడి, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతిరెడ్డి టీఆర్ఎస్ కార్యకర్తలతో రైతన్న సినిమా టికెట్ కొనుక్కుని చూసినందుకు ఆర్ నారాయణమూర్తి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను, రైతులపై బీజేపీ నాయకులు అవలంభించే విధానాల వల్ల కలిగే నష్టాలపై సినిమా తీసినట్లు చెప్పారు. కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణీ సిద్ధు, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, పీఏసీఎస్ చైర్మన్లు మేకల సంపత్ కుమార్ యాదవ్, చల్లా నారాయణరెడ్డి, పూర్ణచంద్రారెడ్డి, టీఆర్ఎస్ అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్దన్ పటేల్, మాజీ అధ్యక్షుడు క్యాతరాజు సాంబమూర్తి, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఆలయ చైర్మన్ గడ్డం కుమార్రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు బుర్ర రమేశ్, వైఎస్సార్టీపీ జిల్లా అధ్యక్షుడు అప్పం కిషన్, టీజేఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాడ హరీశ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.