e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 20, 2022
Home News అక్కడో రకం.. ఇక్కడో రకం

అక్కడో రకం.. ఇక్కడో రకం

  • వడ్ల కొనుగోళ్లపై బీజేపీ తొండాట.. ఢిల్లీ, గల్లీ నేతల తలోమాట
  • ధాన్యం కొనుగోలుపై స్పష్టతనివ్వని కేంద్రం
  • రాష్ట్ర ప్రభుత్వం మీద బురదజల్లుతున్న స్థానిక కమలం నేతలు
  • రైతులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు
  • ప్రభుత్వం వద్దంటున్నా యాసంగిలో వరే వేయాలని తప్పుదారి
  • బీజేపీ తీరుతో అయోమయానికి గురవుతున్న అన్నదాతలు
  • పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీల పోరాటానికి అభినందనలు
  • ఉలుకు పలుకులేని బీజేపీ రాష్ట్ర నేతలపై రైతన్నల మండిపాటు

దేశంలోనే అత్యధికంగా వరి పండిస్తున్న తెలంగాణ రైతులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్షగట్టి వడ్లు కొనబోమని తేల్చిచెబుతుంటే.. మరోవైపు అదే పార్టీకి చెందిన రాష్ట్ర నాయకులు యాసంగిలో వరే పండిచాలని చెబుతూ అన్నదాతలను తప్పుదోవ పట్టిస్తున్నారు. యాసంగి ధాన్యం కొనుగోళ్ల విషయంలో స్పష్టత ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ ఎంపీలు నాలుగు రోజులుగా పార్లమెంట్‌లో కొట్లాడుతుంటే కేంద్రం ఏమాత్రం పట్టించుకోకపోవడం, పైగా తెలంగాణ రైతుల గురించి ఇక్కడి బీజేపీ ఎంపీలు, రాష్ట్ర నాయకులు ఉలుకుపలుకు లేకుండా వ్యవహరిస్తుండడంపై అన్నదాతలు మండిపడుతున్నారు. ఓవైపు వరి కోతలు ముగిసి యాసంగి నాట్లు మొదలవుతున్నా వడ్ల కొనుగోళ్లపై తేల్చి చెప్పకుండా ఢిల్లీలో ఒక రకంగా, గల్లీలో మరోరకంగా మాట్లాడుతూ బీజేపీ నేతలు నాటకాలు ఆడుతున్నారని కర్షకులు కన్నెర్రజేస్తున్నారు.

వరంగల్‌, డిసెంబర్‌ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ రైతులు, వ్యవసాయ రం గం విషయంలో బీజేపీ నేతల రెండు నాల్కల మాటలు విచిత్రంగా ఉంటున్నాయి. యాసంగిలో వడ్ల కొనుగోలుపై కేంద్రం స్పష్టత ఇవ్వకపోగా, యాసంగిలో వరే వేయాలని బీజేపీ రాష్ట్ర నాయకులు రైతులకు సూచిస్తుండడం విస్తుగొలుపుతున్నది. ఓవైపు రైతులకు మద్దతుగా టీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంట్‌లో నాలుగు రోజుల నుంచి అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. బీజే పీ నేతలు మాత్రం ఢిల్లీలో ఒక రకంగా, గల్లీలో మరో రకంగా మాట్లాడుతూ రైతులను అయోమయానికి గురి చేస్తున్నారు. యాసంగి వడ్లు కొ నేదిలేదని కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ఢిల్లీ నేతలు అధికారికంగానే ప్రకటిస్తున్నారు. అవగాహన లే ని బీజేపీ జిల్లా, రాష్ట్ర నేతలు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వమే వడ్లు కొనాలని, లేకుంటే ఊరుకునేది లేదని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన వడ్లతో వచ్చే బి య్యాన్ని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎఫ్‌సీఐ సేకరిస్తుంది. యాసంగిలో వచ్చే బియ్యాన్ని తీసుకునేది లేదని ఎఫ్‌సీఐ ఇప్పటికే అధికారింగా చె ప్పింది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ చెప్పిన విషయాన్ని బీజేపీ రాష్ట్ర, జిల్లా నేతలు దాచిపెడుతున్నారు. వరి రైతులకు నష్టం కలిగించేలా చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ పోరాటాలు, సీఎం కేసీఆర్‌ సూచనలతో రైతులకు కేంద్ర ప్రభుత్వ వైఖరి తెలిసింది. బీజేపీ నేతలు రెండు రకాలుగా మాట్లాతున్నారని అన్నదాతలు గ్రహించారు. వరి సాగు చేస్తే కొనుగోలుకు ఇబ్బందులు ఉంటాయని తెలిసినా బీజేపీ నాయకులు కావాలనే రెచ్చగొడుతున్నారని రైతులు అంటున్నారు. బీజేపీ స్థానిక నేతల అవగాహన లోపమే దీనికి కారణమని చె బుతున్నారు. ఆ పార్టీ నేతలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తీరుగా మాట్లాడుతున్నారని గుర్తు చేస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, జిల్లాలోని పలువురు బీజేపీ నాయకులు అగాహన లేని ప్రకటనలతో రైతులను అయోమయానికి గురి చేస్తుండడంతో యాసంగిలో వరి రైతులు పంటను అమ్ముకునేందుకు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది.

- Advertisement -

పట్టువిడువని టీఆర్‌ఎస్‌ ఎంపీలు

యాసంగి వడ్ల కొనుగోలుపై టీఆర్‌ఎస్‌ ఢిల్లీ స్థాయిలో పోరాటం చేస్తున్నది. పార్లమెంట్‌ స మావేశాల్లో ఆ పార్టీ ఎంపీలు నాలుగు రోజులు గా ఇదే అంశంపై పట్టుబడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి నష్టం వచ్చినా.. రైతులకు ఇబ్బందులు కలుగకూడదనే ఉద్దేశంతో ప్రతి వడ్ల గిం జను కొనుగోలు చేస్తున్నది. తెలంగాణలో ఎక్కు వ విస్తీర్ణంలో సాగయ్యే వరిధాన్యం కొనుగోలుపై కేంద్రం ఆంక్షలు పెట్టింది. రెండేండ్లుగా ఈ ఆంక్షలను ఇంకా పెంచుతున్నది. నిరంతరం ఉచిత కరంటు, ప్రతి ఎకరాకు సాగునీరు, రైతు బంధు పథకం కింద పెట్టుబడి వంటి రాష్ట్ర ప్రభుత్వ చ ర్యలతో తెలంగాణలో సాగు విస్తీర్ణం గణనీయం గా పెరిగింది. నీటి వనరులు ఉండడంతో వరి సాగు ఎక్కువైంది. పండిన పంటను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఊరిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నది. రాష్ట్రం కొ నుగోలు చేసిన వడ్ల నుంచి వచ్చే బియ్యాన్ని సేకరించాల్సిన కేంద్రం ఈ ప్రక్రియ నుంచి వైదొలగాలని చూస్తున్నది. దీనికి నిరసనగా టీఆర్‌ఎస్‌ ఉద్యమాలు చేస్తున్నది. రైతులను, వ్యవసాయరంగాన్ని కుదేలు చేసేలా తెచ్చిన చట్టాలను ఉపసంహరించుకోవాలనే డిమాండ్‌తో అన్నదాతలు చేసిన ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చిం ది. రైతుల సంక్షే మం, వ్యవసాయ రంగ అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్‌ పాటుపడుతుంటే రాష్ట్ర బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, రైతులను వీరు ఏనాడైనా పట్టించుకున్నారా అని అన్నదాతలే ప్రశ్నిస్తున్నారు. బి య్యం కొనుగోలు చేయాల్సింది కేంద్రమే అయి నా రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ నేతలు బురదజల్లడం ఎంతవరకు సమంజసమని నిలదీస్తున్నా రు. కమలం పార్టీ నాయకులు ఇప్పటికైనా అ యోమయం చేసే ప్రకటనలను నిలిపిపేయాలని, కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని, లేదంటే ఆందోళనలకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement