అచ్చంపేటరూరల్ : బీఆర్ఎస్ వరంగల్ రజతోత్సవ సభను విజయవంతంచేయాలని అచ్చం పేట నియోజకవర్గంలో ప్రచారం (BRS Campaign ) హోరందుకుంది. వాల్ పోస్టర్లు ( Wall Posters) , వాల్ రైటింగ్ ( Wall Writing) తో సోషల్ మీడియా, వాట్సప్ పోస్టులు వివిధ రూపాల్లో సభ విజయవంతం కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రచారం చేస్తున్నారు.
అందులో భాగంగా సభను విజయవంతం చేయాలని మండలంలోని చెన్నారం గేటు ప్రయాణికుల ప్రాంగణం వద్ద కేసీఆర్ వర్ధిల్లాలి, బీఆర్ఎస్ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ వాల్ రైటింగ్లు రాశారు. గ్రామగ్రామాన వాల్ పోస్టర్లు అతికించారు. జనాలు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో పోస్టర్లు, వాల్ రైటింగ్ వేయించారు.