అమరావతి : ఏపీలోని విశాఖపట్నం జిల్లాలో డయేరియాతో మరణాలు జరిగితే అసలు మరణాలే లేవంటూ శాసన మండలి (Legislative Council) సమావేశంలో మంత్రి పేర్కొనడాన్ని నిరసిస్తూ శాసనమండలి నుంచి వైసీపీ ఎమ్మెల్సీలు బుధవారం వాకౌట్(Walkout) చేశారు. ఈ సమావేశంలో మండలి ప్రతిపక్ష వైసీపీ నేత , మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) డయేరియా కేసుల గురించి ప్రశ్నోత్తరాల సమయంలో సమస్యను లేవనెత్తారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ సమాదానమిస్తూ డయేరియాతో ఎవరూ చనిపోలేదని సమాదానం ఇచ్చారు.
ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ గుర్ల గ్రామంలో డయేరియాతో 200 మంది బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందగా పదుల సంఖ్యలో చనిపోయరాని ఆరోపించారు. అధికారులు కూడా వచ్చి పరిశీలించారని వివరించారు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ వచ్చి 10 మంది చనిపోయారని చెప్పారని గుర్తు చేశారు. సంబంధిత మంత్రి ఎవరూ చనిపోలేదని ఎలా చెబుతారని ప్రశ్నించారు
. డయేరియా మరణాలను తగ్గించడంలో ప్రభుత్వం విఫలమైందని బొత్స విమర్శించారు. బాధిత కుటుంబాలకు వైఎస్ జగన్ రూ. 2 లక్షల సహాయం చేశారని వెల్లడించారు. ప్రభుత్వం ఎందుకు ఇప్పటివరకు పరిహారం ప్రకటించలేదని నిలదీశారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు.