ఆదిలాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లా మావల మండలంలో జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చిన మహిళలు నిరాశతో వెనుదిరిగారు. మహిళలు ఆదివారం మావల పోలింగ్ కేంద్రానికి వచ్చారు. జాబితాలో వారి పేర్లు లేకపోవడంతో సిబ్బంది వారిని అనుమతించలేదు.
తాము గతంలో మావల పంచాయతీ పరిధిలో ఓట్లు వేశామని, ఇప్పుడు పేర్లు ఎందుకు తీసివేశారని ప్రశ్నించారు. ‘మీరు నివాసముండే ప్రాం తం ఆదిలాబాద్ పట్టణ పరిధిలోకి వస్తుందని, మీ ఓట్లు మున్సిపాలిటీ పరిధిలోకి వస్తాయి’ అని అధికారులు వారికి నచ్చచెప్పడంతో వెనుదిరిగారు.