VLTs Cancell | గడి బురుజులు స్థలాలపై వేసిన వీఎల్టీలను వెంటనే రద్దు చేయాలి
VLTs Cancell | పట్టణంలోని గడి బురుజులు (గ్రామకంఠ ,అబాది) స్థలాలపై వేసిన వీఎల్టీలను రద్దు చేయాలని అఖిలపక్ష ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి.
కోరుట్ల : పట్టణంలోని గడి బురుజులు (గ్రామకంఠ ,అబాది) స్థలాలపై ( Gadi Buruju Lands ) వేసిన వీఎల్టీలను రద్దు ( VLTs Cancell ) చేయాలని అఖిలపక్ష ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. మంగళవారం పాత మున్సిపల్ కార్యాలయం వద్ధ చేపట్టనున్న నిరసన దీక్షలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ మేరకు సోమవారం అఖిలపక్ష, ప్రజాసంఘాల ఐక్యవేదిక పక్షాన నిర్వహించిన సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, మేధావులు పాల్గొని గడి బురుజుల భవిష్యత్తుపై చర్చించారు. గడి బురుజుల పరిధిలోని ఖాళీ భూములకు ఇచ్చిన వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ (VLT)ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
గడి బురుజుల ఖాళీ స్థలాలను భూ అక్రమార్కుల నుంచి కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ భూములను ప్రజలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేయాలని కోరారు. కూరగాయల మార్కెట్, పార్కు వంటి ప్రజా అవసరాల కోసం వినియోగించడంతో పాటు, ఇప్పటికే ఉన్న మైసమ్మ తల్లి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు.
కోనేరును పునరుద్ధరించి, ఈ ప్రాంతంలోని పురాతన చారిత్రక కట్టడాలను సంరక్షించాలని తీర్మానించారు. ఈసమావేశంలో నాయకులు చెన్న విశ్వనాథం, డాక్టర్ పేట భాస్కర్, ఎం డి ముజాహిద్, చింతా భూమేశ్వర్, ఎం డి ముజీబుర్ రెహమాన్, సుతారి రాములు, తుమ్మనపల్లి శ్రీనివాస్ బాబు, కుంచెం శంకర్, శనిగారపు రాజేష్, పోతని సత్యం, న్యాయవాది బర్ల సంతోష్, గణేష్, వికాస్, రమేష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
OTT Movies | ఈ వారం ఓటీటీలో సందడే సందడి.. దసరాకి రానున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే..
Virosh | ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముందు తిరుమలలో ప్రత్యక్షమైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. వీడియో వైరల్
Vijay | తమిళనాడు సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. దళపతిపై రౌడీ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు!
Singareni Karmika Garjana | రేపే సింగరేణి కార్మిక గర్జన.. 30 వేల మందిని సభకు సమీకరించేందుకు సన్నాహాలు
ప్రాణం తీసిన మెట్రో సీటు గొడవ.. ఢిల్లీలో మాజీ ఐఏఎస్ అధికారి అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

