న్యూఢిల్లీ : రూ . ౩౦,౦౦౦లోపు బెస్ట్, లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ కోసం చూసేవారికి వివో వీ25 సరైన ఎంపికగా టెక్ నిపుణులు చెబుతున్నారు. మెరుగైన హార్డ్‌వేర్, కెమెరాలు, డిజైన్ పరంగా వివో వీ25 దీటైన ఎంపికగా సూచిస్తున్నారు. రూ ౩౦,౦౦౦లోపు ధరకే 5జీ కనెక్షన్‌తో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఆకట్టుకునే డిజైన్, చార్జింగ్ టెక్నాలజీ, 5జీ ఇలా అన్ని రకాలుగా వివో లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ కస్టమర్లను ఆకట్టుకుంటుంది.
వివో వీ25 భారత్‌లో రూ 27,999 ప్రారంభ ధర నుంచి అందుబాటులో ఉంది. ఓఐఎస్, ఆటోఫోకస్, 4కే వీడియో రికార్డింగ్ వంటి హాట్ ఫీచర్లు ఈ ఫోన్ ప్రత్యేకతలుగా చెబుతున్నారు. అందుబాటు ధరలో అత్యాధునిక ఫీచర్లతో వివో వీ25 స్మార్ట్‌ఫోన్ మెరుగైన ఎంపిక. వివో వీ25 64 మెగాపిక్సెల్ ఓఐఎస్ +, ఈఐఎస్ నైట్ కెమెరా, 8 ఎంపీ సూపర్ అల్ట్రావైడ్ కెమెరా, 2 ఎంపీ సూపర్ మ్యాక్రో లెన్స్ కెమెరాతో ఈ స్మార్ట్‌ఫోన్ ఆకట్టుకుంటుంది.
ముందుభాగంలో బెస్ట్ సెల్ఫీ కెమెరాతో వివో వీ25 అందుబాటు ధరలోనే లభిస్తుండటం ప్రత్యేకతగా టెక్ నిపుణులు చెబుతున్నారు. 50 ఎంపీ ఫ్రంట్ కెమెరా షార్పర్, డిటెయిల్డ్ సెల్ఫీల కోసం ఐ ఆటోఫోకస్ ఫీచర్‌ను కలిగిఉంది. ఫ్రంట్ కెమెరా నుంచి 4కే వీడియోలను రికార్డు చేసుకోవచ్చు.
ఆకట్టుకునే స్టైలిష్ డిజైన్, స్టన్నింగ్ లుక్‌తో పాటు వివో వీ25 6.44 ఇంచ్ ఎఫ్‌హెచ్‌డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లేను కలిగిఉంది. ఇక ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ కార్డుల ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేసే వారికి రూ 2500 క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను అందిస్తున్నారు.