హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): ఏపీలో ఆ రాష్ట్ర బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ బుధవారం పర్యటించనున్నారు. ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరి గన్నవరం విమానాశ్రయంలో దిగి, అక్కడి నుంచి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో కలిసి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం, ఉండవల్లి గ్రామానికి చేరుకొంటారు. అక్కడ మహా మృత్యుంజయ జప (దోష) విశ్వశాంతి మహాయాగానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత, బీఆర్ఎస్ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. పార్టీలో చేరికలు, ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతంపై చర్చించనున్నట్టు సమాచారం.