విశ్వక్సేన్ కథానాయకుడిగా తరుణ్‌భాస్కర్ దర్శకత్వంలో ఎనిమిదేండ్ల క్రితం వచ్చిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా ఎంతటి విజయాన్ని అందుకున్నదో తెలిసిందే. కల్ట్ కామెడీ మూవీగా ఆడియన్స్‌ని నుంచి కితాబులందుకున్న ఈ చిత్రానికి సీక్వెల్‌గా రాబోతున్న సినిమా ‘ఈఎన్ఈ రిపీట్’. విశ్వక్సేన్, అభినవ్ గోమటం, వెంకటేశ్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి కలిసి నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నది. సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి నిర్మాతలు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ థాయిలాండ్‌లో జరుగుతున్నది. నెలరోజుల పాటు ఈ షెడ్యూల్ సాగుతుందని మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా విడుదల చేసిన స్టిల్‌లో వింటేజ్ కన్వర్టిబుల్ కారులో హాయిగా కూర్చుని, ఎంతో ఉత్సాహం కనిపిస్తున్న విశ్వక్, అభినవ్ గోమటం, వెంకటేశ్ కాకుమానులను చూడొచ్చు.ఈ చిత్రానికి కెమెరా: ఏజే ఆరోల్, సంగీతం: వివేక్ సాగర్.