నవ్వించేందుకు మళ్లీ వస్తున్నారు
విశ్వక్సేన్ కథానాయకుడిగా తరుణ్‌భాస్కర్ దర్శకత్వంలో ఎనిమిదేండ్ల క్రితం వచ్చిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా ఎంతటి విజయాన్ని అందుకున్నదో తెలిసిందే. కల్ట్ కామెడీ మూవీగా ఆడియన్స్‌ని నుంచి కితాబులందుకున్న ఈ చిత్రానికి సీక్వెల్‌గా రాబోతున్న సినిమా ‘ఈఎన్ఈ రిపీట్'.
విశ్వక్సేన్ కథానాయకుడిగా తరుణ్‌భాస్కర్ దర్శకత్వంలో ఎనిమిదేండ్ల క్రితం వచ్చిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా ఎంతటి విజయాన్ని అందుకున్నదో తెలిసిందే. కల్ట్ కామెడీ మూవీగా ఆడియన్స్‌ని నుంచి కితాబులందుకున్న ఈ చిత్రానికి సీక్వెల్‌గా రాబోతున్న సినిమా ‘ఈఎన్ఈ రిపీట్’. విశ్వక్సేన్, అభినవ్ గోమటం, వెంకటేశ్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి కలిసి నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నది. సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి నిర్మాతలు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ థాయిలాండ్‌లో జరుగుతున్నది. నెలరోజుల పాటు ఈ షెడ్యూల్ సాగుతుందని మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా విడుదల చేసిన స్టిల్‌లో వింటేజ్ కన్వర్టిబుల్ కారులో హాయిగా కూర్చుని, ఎంతో ఉత్సాహం కనిపిస్తున్న విశ్వక్, అభినవ్ గోమటం, వెంకటేశ్ కాకుమానులను చూడొచ్చు.ఈ చిత్రానికి కెమెరా: ఏజే ఆరోల్, సంగీతం: వివేక్ సాగర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

