‘విష్ణు విన్యాసం’ ఫస్టాఫ్ అంతా యూత్‌కి కనెక్ట్ అవుతుందని, సెకండాఫ్‌లో ఫ్యామిలీ డ్రామాగా ఆకట్టుకుంటుందని చెప్పారు చిత్ర కథానాయకుడు శ్రీవిష్ణు. యదునాథ్ మారుతీ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీసుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ పతాకంపై సుమంత్ నాయుడు జి నిర్మించారు నయన్ సారిక కథానాయికగా నటించింది. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు.
ఇది ష్యూర్ షాట్ సూపర్‌హిట్ సినిమా అని, కుటుంబంతో కలిసి హాయిగా నవ్వుకుంటారని, చాలా రోజుల పాటు గుర్తుండిపోతుందని శ్రీవిష్ణు అన్నారు. ఆద్యంతం హాస్యప్రధానంగా అలరించే సినిమా ఇదని దర్శకుడు తెలిపారు. శ్రీవిష్ణు కామెడీ విన్యాసాలు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తాయని నిర్మాత సుమంత్ నాయుడు జి చెప్పారు. శ్రీవిష్ణు నుంచి ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలున్న సినిమా ఇదని, తన పాత్ర కూడా చక్కటి వినోదాన్ని పంచుతుందని కథానాయిక నయన్ సారిక చెప్పింది.