Virat Kohli : భారత జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ(Virat Kohli) అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐదొందల అంతర్జాతీయ మ్యాచ్‌లో శతకం సాధించాడు. చారిత్రాత్మక మ్యాచ్‌లో గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ షానన్ గాబ్రియేల్ ఓవర్లో బౌండరీ కొట్టి సెంచరీకి చేరువయ్యాడు. 180 బంతుల్లో 10 ఫోర్లతో కింగ్ కోహ్లీ శతకం పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో అతడు మూడంకెల స్కోర్ చేయడం ఇది 29వసారి.
దాంతో 500వ మ్యాచ్‌లో వంద కొట్టిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్ (664), ధోనీ (538), రాహుల్ ద్రావిడ్ (509) వంటి ఆటగాళ్లు 500పైగా మ్యాచులు ఆడిన.. వారెవరూ 500వ మ్యాచ్‌లో సెంచరీ చేయలేకపోయారు.
In 📸📸@imVkohli celebrates his 29th Test ton 🫡#WIvIND pic.twitter.com/H0DdmUrBm0
— BCCI (@BCCI) July 21, 2023
చిరస్మరణీయ సెంచరీతో కోహ్లీ పలు రికార్డులు బద్ధలు కొట్టాడు. వెస్టిండీస్‌పై అత్యధిక సెంచరీలు కొట్టిన దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ జాక్వెస్ కలిస్(Jacques Kallis) రికార్డు సమం చేశాడు. కలిస్ విండీస్‌పై 12 శతకాలు బాదాడు. అయితే.. ఈ జాబితాలో టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ (13) అగ్రస్థానంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ 11 సార్లు విండీస్‌పై వంద కొట్టారు.
విరాట్ కోహ్లీ, బ్రియాన్ లారా
అంతేకాదు నాలుగోస్థానంలో ఎక్కువ సెంచరీలు బాదిన నాలుగో క్రికెటర్‌గా విరాట్ మరో రికార్డు సృష్టించాడు. విండీస్ లెజెండ్ బ్రియాన్ లారా(Brian Lara) రికార్డును బద్ధలు కొట్టాడు. లారా 24 సెంచరీలు కొట్టగా.. కోహ్లీ నాలుగో స్థానంలో 25సార్లు వంద కొట్టాడు. అయితే.. భారత లెజెండ్ సచిన్ టెండూల్కర్ అత్యధికంగా 44 సార్లు సెంచరీ సాధించడం విశేషం. జాక్వెస్ కలిస్ 35 శతకాలతో రెండో స్థానంలో, మహేల జయవర్దనే 30 శతకాలతో మూడో స్థానంలో ఉన్నారు.