Ashes Series | బెయిర్‌స్టో సెంచరీ మిస్.. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌కు భారీ ఆధిక్యం
Ashes Series : ఇంగ్లండ్ ఆటగాళ్లు కీలకమైన నాలుగో టెస్టు(Old Trafford Test)లో దంచికొట్టారు. బాజ్‌బాల్(Bazzball) ఆటను మరిపిస్తూ అర్థ శతకాలు సాధించారు. గత రెండు టెస్టుల్లో విఫలమైన జానీ బెయిర్‌స్టో(99 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడడంతో ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్‌లో...
Ashes Series : ఇంగ్లండ్ ఆటగాళ్లు కీలకమైన నాలుగో టెస్టు(Old Trafford Test)లో దంచికొట్టారు. బాజ్‌బాల్(Bazzball) ఆటను మరిపిస్తూ అర్థ శతకాలు సాధించారు. గత రెండు టెస్టుల్లో విఫలమైన జానీ బెయిర్‌స్టో(99 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడడంతో ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 592 పరుగుల భారీ స్కోర్ చేసింది. దాంతో, 275 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. జో రూట్(84), హ్యారీ బ్రూక్(61), కెప్టెన్ బెన్ స్టోక్స్(51) హాఫ్ సెంచరీలతో చెలరేగారు.
బెయిర్‌స్టో చివరి వికెట్‌కు అండర్సన్‌తో కలిసి విలువైన 50 రన్స్ జోడించాడు. అయితే.. అండర్సన్‌ను కామెరూన గ్రీన్ ఔట్ చేయడంతో బెయిర్‌స్టో సెంచరీ మిస్ అయ్యాడు. ఆసీస్ బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్ 5 వికెట్లు పడగొట్టాడు. మిచెల్ స్టార్క్, కామెరూన్ గ్రీన్ తలా రెండు వికెట్లు తీశారు.
బెన్ స్టోక్స్(51), హ్యారీ బ్రూక్(61)

ఓల్డ్ ట్రఫోర్డు(Old Trafford)లో జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 317 పరుగులకు ఆలౌటయ్యింది. క్రిస్ వోక్స్ ఐదు వికెట్లతో ఆసీస్‌ను దెబ్బ కొట్టాడు. కంగారు జట్టులో మిచెల్ మార్ష్ (51), మార్నస్ లబూషేన్(51) అర్ధ సెంచరీలతో రాణించారు. ట్రావిస్ హెడ్(48), స్టీవ్ స్మిత్(41) తక్కువకే వెనుదిరిగారు. యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ తొలి రెండు టెస్టుల్లో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. సిరీస్‌లో నిలవాలంటే గెలవక తప్పని మూడో టెస్టులో అద్భుత విజయం సాధించింది. హ్యారీ బ్రూక్ (74) వీరోచిత ఇన్నింగ్స్ ఆడడంతో సిరీస్‌లో బోనీ కొట్టింది. నాలుగో టెస్టులోనూ నెగ్గి, సిరీస్ కాపాడుకోవాలని బెన్ స్టోక్స్ బృందం పట్టుదలతో ఉంది.
ఇవి కూడా చదవండి
Dinesh Karthik | ‘లగాన్’ సినిమా చూసొచ్చాడా ఏంటీ..? అచ్చుగుద్దినట్టు రూట్ అవే షాట్లు ఆడుతున్నాడు : దినేశ్ కార్తిక్
Waqar Younis | ఓవల్‌లోనే భారత్‌ను చితక్కొట్టేశాం.. ఆసియా కప్ ఓ లెక్కా?.. పాక్ లెజెండ్ కారుకూతలు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

