Dinesh Karthik | ‘లగాన్’ సినిమా చూసొచ్చాడా ఏంటీ..? అచ్చుగుద్దినట్టు రూట్ అవే షాట్లు ఆడుతున్నాడు : దినేశ్ కార్తిక్
Dinesh Karthik : ఇంగ్లండ్ స్టార్ జో రూట్(Joe Root) బ్యాటింగ్‌పై భారత కామెంటేటర్ దినేశ్ కార్తిక్(Dinesh Karthik) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. యాషెస్ సిరీస్ నాలుగో టెస్టులో జో రూట్ ఆడిన స్కూప్, రివర్స్‌స్వీప్ షాట్లు అలనాటి 'లగాన్'(Lagaan) సినిమాను గుర్తుకు చేస్తున్నాయని అన్నాడు. ఆ సినిమాలో గురన్(Guran) పాత్రలో నటించిన వ్యక్తి ఆడినట్టే రూట్ స్కూప్(Scoop), రివర్స్‌స్వీప్ షాట్లు కొడుతున్నాడని..
Dinesh Karthik : ఇంగ్లండ్ స్టార్ జో రూట్(Joe Root) బ్యాటింగ్‌పై భారత కామెంటేటర్ దినేశ్ కార్తిక్(Dinesh Karthik) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. యాషెస్ సిరీస్ నాలుగో టెస్టులో జో రూట్ ఆడిన స్కూప్, రివర్స్‌స్వీప్ షాట్లు అలనాటి ‘లగాన్'(Lagaan) సినిమాను గుర్తుకు చేస్తున్నాయని అన్నాడు. ఆ సినిమాలో గురన్(Guran) పాత్రలో నటించిన వ్యక్తి ఆడినట్టే రూట్ స్కూప్(Scoop), రివర్స్‌స్వీప్(reverse sweep) షాట్లు కొడుతున్నాడని కార్తిక్ తెలిపాడు.
‘జో రూట్ తన గురు గురన్ కాపీ కొడుతున్నాడనుకుంటా. అయితే.. గురన్ కంటే రూట్ చాలా కళాత్మకంగా, నైపుణ్యంగా ఆ షాట్ ఆడాడు’ అని కార్తిక్ వెల్లడించాడు. క్రికెట్ కథాంశంతో అషుతోశ్ గోవారికర్(Ashutosh Gowariker) తెరకెక్కించిన లగాన్ సినిమా తెరకెక్కించాడు. ఇందులో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమిర్ ఖాన్(Aamir Khan) ప్రధాన పాత్రలో నటించాడు. 2001లో విడుదలైన ఈ మువీ అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది.
లగాన్ సినిమాలో అమిర్ ఖాన్

ఈ సినిమా బ్రిటీష్ కాలం నాటి పరిస్థితులను కళ్లకు కట్టింది. అందులో అప్పటివరకు క్రికెట్ బ్యాట్, బంతి ముట్టని హీరో బృందం, పటిష్టమైన ఇంగ్లండ్ జట్టును ఓడిస్తుంది.
8 ఫోర్లు, ఒక సిక్స్‌తో
సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో రూట్ తనదైన స్కూప్, రివర్స్ స్వీప్ షాట్లతో అలరిస్తున్నాడు. నాలుగో టెస్టులోనూ ఈ మాజీ కెప్టెన్ అవే షాట్లతో చూడచక్కని బౌండరీలు బాదాడు. 95 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్‌తో 84 పరుగులు చేసి జట్టు భారీ స్కోర్‌కు తనవంతు సహకారం అందించాడు. తొలి రెండు టెస్టుల్లో చిత్తుగా ఓడిన ఇంగ్లండ్ మూడో టెస్టులో అద్భుత విజయంతో పోటీలో నిలిచింది. నాలుగో టెస్టులోనూ నెగ్గి, సిరీస్ కాపాడుకోవాలనే పట్టుదలతో ఉంది.
ఇవి కూడా చదవండి
Waqar Younis | ఓవల్‌లోనే భారత్‌ను చితక్కొట్టేశాం.. ఆసియా కప్ ఓ లెక్కా?.. పాక్ లెజెండ్ కారుకూతలు
Chris Lewis | తలకిందులైన వరల్డ్‌కప్ హీరో జీవితం.. ఎంత వేగంగా జట్టులోకి వచ్చాడో అంతే వేగంగా దూరమయ్యాడు!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

