Chris Lewis | తలకిందులైన వరల్డ్‌కప్ హీరో జీవితం.. ఎంత వేగంగా జట్టులోకి వచ్చాడో అంతే వేగంగా దూరమయ్యాడు!
Chris Lewis : ఇంగ్లండ్ వరల్డ్‌కప్ హీరోలలో క్రిస్ లెవిస్(Chris Lewis) ఒకడు. 1992 ప్రపంచకప్(1992 World Cup)లో ఇంగ్లండ్ టైటిల్ పోరులో నిలువడంలో లెవిస్ది కీలక పాత్ర. ఆల్‌రౌండర్‌గా జట్టు విజయాల్లో కీలక భూమిక పోషించిన లెవిస్ జీవితం అనూహ్యంగా తలకిందులైంది. అవును.. మ్యాచ్ ఫిక్సింగ్(Match Fixing) ఆరోపణలతో పాటు నిషేధిత మాదక ద్రవ్యాల(Drugs)ను రవాణా చేశాడన్న...
Chris Lewis : ఇంగ్లండ్ వరల్డ్‌కప్ హీరోలలో క్రిస్ లెవిస్(Chris Lewis) ఒకరు. 1992 ప్రపంచకప్(1992 World Cup)లో ఇంగ్లండ్ టైటిల్ పోరులో నిలువడంలో లెవిస్ది కీలక పాత్ర. ఆల్‌రౌండర్‌గా జట్టు విజయాల్లో కీలక భూమిక పోషించిన లెవిస్ జీవితం అనూహ్యంగా తలకిందులైంది. అతను ఎంత వేగంగా జట్టులోకి వచ్చాడో వివాదస్పద రీతిలో అంతే వేగంగా జట్టుకు దూరమయ్యాడు. అవును.. మ్యాచ్ ఫిక్సింగ్(Match Fixing) ఆరోపణలతో పాటు నిషేధిత మాదక ద్రవ్యాల(Drugs)ను రవాణా చేశాడన్న కారణాలతో లెవిస్పై పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
మ్యాచ్ ఫిక్సింగ్పై కొందరు అతడితో సంభాషించడం.. మీడియాలో మరో రకంగా ప్రచారం కావడం లెవిస్ కెరీర్‌కు మధ్యలోనే ఫుల్స్టాప్ పడేలా చేసింది. అయితే.. భారత సంతతికి చెందిన వ్యక్తులు తనతో ఫిక్సింగ్ గురించి తనతో చెప్పిన మాటలపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ECB)కు వివరించినా లెవిస్‌కు సరైన న్యాయం జరుగలేకపోయింది.
1992 ప్రపంచకప్ ఫైనల్లో క్రిస్ లెవిస్

చెన్నై టెస్టులో అద్భుత శతకం
1993లో భారత పర్యటన(India Tour)లో భాగంగా చెన్నైలో జరిగిన టెస్టులో లెవిస్ అద్భుత శతకంతో విజృంభించాడు. టీమిండియా బౌలింగ్ దాడిని సమర్థంగా ఎదుర్కొంటూసెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు లిక్విడ్ కొకైన్(Cocaine)తో ఇంగ్లండ్‌లోకి ప్రవేశించాడన్న కారణంతో లెవిస్పై కేసులు నమోదయ్యాయి. తన కెరీర్లో జరిగిన విశేషాలను ‘క్రేజీ: మై రోడ్ టు రిడెప్షన్’(crazy: my road to redemption) అనే పుస్తకంలో వివరంగా రాసుకొచ్చాడు. ‘ఫిక్సింగ్ విషయంలో జరిగింది ఒకటైతే.. బయటికి వెల్లడైంది మరొకటి’ అని 55 ఏండ్ల లెవిస్ ఆ పుస్తకంలో చెప్పుకొచ్చాడు.
చెన్నై టెస్టులో సెంచరీ కొట్టిన లెవిస్

పదేళ్లకే బ్రిటన్‌కు వలస
గయానాలో 1968లో జన్మించిన లెవిస్ పదేండ్ల వయసులో బ్రిటన్‌కు వలస వచ్చాడు. విడాకుల కారణంగా
తల్లి దగ్గర పెరిగిన లెవిస్..17 ఏండ్ల వయసులో లిసేస్టర్షైర్(Leicestershire) తరఫున క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత నాటింగ్‌హామ్‌షైర్, సర్రే తరఫున లెవిస్ ప్రాతినిధ్యం వహించాడు. ఇంగ్లండ్ తరఫున 32 టెస్టులు, 53 వన్డే మ్యాచ్‌లాడిన లెవిస్ ఆల్‌రౌండర్‌గా అందరి మన్ననలు పొందాడు. బ్యాటింగ్‌కు తోడు ఉపయుక్తమైన పేస్ బౌలింగ్‌తో ఇంగ్లండ్ జట్టుకు సేవలందించాడు. వీవీయన్ రిచర్డ్స్(viv richards), సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar), బ్రియాన్ లారా(Brian Lara) వంటి దిగ్గజ క్రికెటర్లతో కలిసి ఆడిన లెవిస్ ఫిక్సింగ్ ఆరోపణలతో అనూహ్యంగా ఆటకు దూరం కావాల్సి వచ్చింది.
ఇవి కూడా చదవండి
Zaka Ashraf | షాహీన్ ఆఫ్రీదీ టాప్ -10 బ్యాటర్లలో ఒకడట.. పీసీబీ అధ్యక్షుడిని ఆడేసుకుంటున్న నెటిజన్లు
Rahul Dravid | ఐదొందల మ్యాచ్‌లంటే ఆషామాషీ కాదు.. కోహ్లీ ఎన్ని త్యాగాలు చేశాడో ఊహించగలను : ద్రవిడ్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

