ఆదిలాబాద్ : జిల్లాలో కురుస్తున్న వర్షాల ( Rain ) కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జైనథ్ మండల కేంద్రంలో కురిసిన వర్షానికి నీరు ఇళ్లల్లోకి రావడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. రోడ్డు విస్తరణ ( Road expansion ) పనుల్లో భాగంగా ఎత్తు పెంచడంతో వర్షపునీరు ఇళ్లలోకి చేరింది. దీంతో బాధితులు గురువారం ఉదయం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
బాధితులకు బీఆర్ఎస్ కార్యకర్తలు మద్దతు ఇచ్చారు. అనంతరం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించడం తో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వర్షం నీరు, మురికి నీరు సాఫీగా వెళ్లడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాస్తారోకో వల్ల ఇరువైపులా వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోవడంతో పోలీసులు జోక్యం చేసుకుని గ్రామస్థులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.