కడ్తాల్, నవంబర్ 15 : పేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని రావిచేడ్ గ్రామానికి చెందిన సుభాష్‌కు రూ.60వేలు, సాలార్‌పూర్ తండాకు చెందిన దీపికకు రూ.50500, కల్వకుర్తి మండలం జీడిపల్లికి గ్రామానికి చెందిన దస్లీకి రూ.14వేలు, శిలార్పల్లి గ్రామానికి చెందిన బాలయ్యకు రూ.56వేలు, కల్వకుర్తి పట్టణానికి చెందిన అమీనాబీకి రూ.60వేలు, వెల్దండ మండలం తాండ్ర గ్రామానికి చెందిన యాదమ్మకు రూ.24వేలు, రాచూర్ తండాకు చెందిన దర్జీకి రూ.12వేలు ఎమ్మెల్సీ సహకారంతో సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరయ్యాయి. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు ఎమ్మెల్సీ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. సీఎంఆర్ఎఫ్ పథకం నిరుపేదలకందరికీ వరంలా మారిందని, ఈ పథకంతో పేదలకు కార్పొరేట్ దవాఖానల్లో అత్యుత్తమ వైద్యం అందుతున్నదని తెలిపారు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటున్నదని, సబ్బండవర్ణాలవారికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని వివరించారు. అనంతరం టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు భాస్కర్‌రెడ్డికి చెందిన వ్యాపార సముదాయాన్ని ఎమ్మెల్సీ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ కమ్లీమోత్యానాయక్, జడ్పీటీసీ భరత్‌ప్రసాద్, నాయకులు భాస్కర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, మోత్యానాయక్, హన్మానాయక్, వేణుగోపాల్, వీరయ్య, జహంగీర్‌అలీ, శ్రీకాంత్‌రెడ్డి, విజయ్‌నాయక్, నరేశ్‌నాయక్, బిక్కునాయక్, డాక్టర్ శ్రీనివాస్, సుమన్, కమల్నాథ్రెడ్డి, భిక్షపతి, ప్రేమ్‌రాజ్, గణేశ్‌గౌడ్, రాంచంద్రయ్య, భూనాథ్నాయక్, ప్రభులింగం, గోపినాయక్, జంగయ్య, భానుకిరణ్, మణికిరణ్, కార్తీక్‌గౌడ్, యశస్విని, శారద పాల్గొన్నారు.