కొడంగల్, అక్టోబర్ 30: అధికారులు ప్రజలకు నిరంత రం అందుబాటులో ఉండాలని కొడంగల్ ఎమ్మెల్యే ప ట్నం నరేందర్‌రెడ్డి సూచించారు. శనివారం స్థానిక ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్ మండలాల విద్యుత్, మిషన్ భగీరథ అధికారులతో ఆయన రివ్యూ సమావేశా న్ని నిర్వహించారు. గ్రామాలవారీగా జరుగుతున్న అభివృ ద్ధి పనుల పురోగతి, పెండింగ్ పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పల్లె, పట్టణప్రగతిలో భాగంగా గ్రామాల్లోని విద్యుత్ సమస్యలను పరిష్కరించడంలో అధికారులు చాలావరకు విఫలమయ్యారని, నేటికీ పనులు అసంపూర్తిగా ఉన్నాయని మండిపడ్డారు. గ్రామాల్లో స్తంభాలను ఏర్పాటు చేసి వాటికి తీగలు బిగించలేదని, లోవోల్టేజీ స మస్య ఉన్న గ్రామాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించారు. సర్పంచ్‌లను కలి సి గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్న పనుల జాబితాను తీసుకొని నెల రోజుల్లో ఆ పనులను పూర్తి చేయాలన్నారు. వచ్చే నెల కూడా రివ్యూ సమావేశం ఉంటుందని, అప్పటికీ పనులు పూర్తి కాకపోతే అధికారులపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అదేవిధంగా మిషన్ భగీరథ పనులు కూడా ఆయా గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్నాయని వాటిని కూడా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో మిషన్ భగరథ ఎస్ఈ వెంకటరమణ, ఈఈ పద్మజ, డీఈ శషాంక్మిశ్రా, ఏఈ హుస్సేన్, విద్యుత్ ఏఈ రఘువీర్, ఏడీ నవీన్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ నాగరాజు, పీఏసీఎస్ అధ్యక్షులు కటకం శివకుమార్, విష్ణువర్ధన్‌రెడ్డి, దౌల్తాబాద్ జడ్పీటీసీ కోట్ల మహిపాల్, ఎంపీపీ విజయ్‌కుమార్, బొంరాస్‌పేట వైస్ ఎంపీపీ నారాయణరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి టీటీ రాములు, మండలాధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు రమేశ్‌బాబు, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
మండలంలోని చిట్లపల్లి గ్రామానికి చెందిన అబ్దుల్ కరీం కు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.80 వేల చెక్కును ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి శనివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారుకు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకట్‌రెడ్డి, కౌన్సిలర్ మధుసూదన్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.