తాండూరు, అక్టోబర్ 29: నేడు తాం డూరుకు విద్యాశాఖ మంత్రి సబితాఇం ద్రారెడ్డి రానున్నారు. నియోజకవర్గంలో రూ.26.42 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతోపా టు నూతన నిర్మాణాలకు ఆమె శంకుస్థాపన చేస్తారని తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. రూ. 20కోట్లతో చేపట్టిన మాతాశిశు దవాఖా న ప్రారంభం, రూ.3.47 కోట్లతో పూర్తయిన తాండూరు మున్సిపల్ భవనం, రూ.2.25 కోట్లతో పూర్తయిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన ప్రారంభోత్సవం, అదేవిధంగా రూ.20లక్షలతో సాయిపూర్లో నిర్మించనున్న అంగన్వాడీ భవ నం, రూ.50 లక్షలతో పెద్దేముల్ బాలు ర ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు ఆమె ఎంపీ రంజిత్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డితో కలిసి ప్రారంభోత్సవా లు, శంకుస్థాపన చేస్తారన్నారు.