శంకర్పల్లి, అక్టోబర్ 29 : శంకర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలు నేడు ఏపుగా పెరిగి ఆహ్లాదకరంగా మారాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాతనే బురదమయంగా ఉన్న ఆవరణలో కోటి రూపాయలు ఖర్చు చేసి సీసీ రోడ్లు వేశారు. రోడ్ల పక్కన వివిధ రకాల మొక్కలు నాటగా, అవి పద్దవిగా పెరిగి మార్కెట్‌కే కొత్తశోభను తీసుకొచ్చాయి. మార్కెట్ స్వాగత తోరణం నిర్మించి ఇరుపక్కలా మొక్కలను నాటారు. మార్కెట్ ఆవరణలోని గోదాముల పరిసరాల్లో గుల్మోర్, తదితర రకాల మొక్కలు నాటారు. వాటికి ఎండా కాలంలో ఎర్రని పూలు పూసి మరింత కనువిందు చేస్తాయి. సుమారు 45 లక్షల రూపాయలు వెచ్చించి నూతన మార్కెట్ భవనాన్ని నిర్మించారు.
హరిత నిధి ఆనందదాయకం
తమవంతు ఆర్థికం అందిద్దాం
పుడమితల్లి ఎదపై మొక్కలు నాటుదాం
మొక్కలేకుంటే దిక్కులేదు
పండ్లు ఫలాలు కావాలన్నా
చల్లటి గాలి నీడలు కావాలన్నా
ప్రాణవాయువు అందాలన్నా
కాలుష్యం తగ్గాలన్నా
సకాలంలో వానలు కురవాలన్నా
ప్రకృతి పరవశించాలన్నా
అన్నింటికి మూలాధారం వృక్షాలు
నాటుదాం మొక్కలను అందరం
నాటిన మొక్కలను బతికించుటకు
హరితనిధికి ఆసరవుదాం
ఉడతాభక్తిగా పాల్గొందాం
తోచినంత ఆర్థికం అందిద్దాం
మొక్కలన్నింటిని రక్షించుకుందాం
భావి తరాలకు వృక్ష సంపదను
బహుమానంగా అందిద్దాం
రచన : మాసని వెంకటయ్య,నాందార్‌పూర్, బొంరాస్‌పేట మండలం.