వికారాబాద్, అక్టోబర్ 27: విజయగర్జన సభను విజయవంతం చేద్దామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం వికారాబాద్ పట్టణంలోని అనంతగిరి సమీపంలోని తేజ కన్వె న్షన్హాల్లో వికారాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, ప్రజా ప్రతి నిధులకు, కార్య కర్తలకు విజయ గర్జన సన్నాహక సమావేశం నిర్వహించారు. రెండు రోజుల క్రితం రామయ్యగూడ కౌన్సిలర్ ఆర్.నర్సింహులు గుండెపోటుతో మృతి చెందడంతో ఆయన చిత్రాపటానికి పూలమాలలు వేసి పార్టీ నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లా డుతూ నవంబరు 15న వరంగల్‌లో జరిగే విజయ గర్జన సభకు వికారాబాద్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్లాలన్నారు. తాను కూడా బస్‌లోనే ప్రయాణం చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో టీఎస్‌ఈడబ్ల్యూడీసీ చైర్మన్ నాగేందర్ గౌడ్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, ధారూరు జడ్పీటీసీ సుజాత, పార్టీ నాయకులు వేణుగోపాల్ రెడ్డి, హన్మంత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, రమేశ్, సంతోష్‌కుమార్, నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.v