ధారూరు, నవంబర్ 18: గతంలో జరిగిన పం చాయతీ ఎన్నికలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ల ఎన్ని కల్లో ఎన్నికల అధికారులకు ఎన్నికల వ్యయం సమర్పించకపోవడంతో ఎన్నికల సంఘం అధి కారులు అనర్హత వేశారు. ధారూరు మండల పరి ధిలో 32 గ్రామ పంచాయతీలు ఉండగా సు మా రు 20గ్రామాల్లోను వార్డు సభ్యులకు ఎన్నికల అధికారులు ఎన్నికల వ్యయం సమర్పించకపో వడంతో అనర్హత వేటు వేశారు. ధారూరు మం డల పరిధిలోని అల్లీపూర్ గ్రామపంచాయతీ పరిధిలో ఒకరికి, అంపల్లి పరిధిలో 8 మందికి, అం తారం గ్రామ పంచాయతీ పరిధిలో 4 గురికి, చింతకుంట పరిధిలో 5గురికి, ధర్మపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో 4గురికి, ధారూరు పరిధిలో ఒకరికి అనర్హత వేటు పడింది. అలాగే ధారూరు స్టేషన్ గ్రామ పంచాయతీ పరిధిలో 8 మందికి, దోర్నాల్ పరిధిలో ఒకరికి, గడ్డమీది గంగారం గ్రామ పంచాయతీ పరిధిలో ఇద్దరికి, హరిదాస్పల్లి పరిధిలో 8 మందికి, కొండా పూర్కలాన్ గ్రామ పంచాయతీ పరిధిలో ఒకరికి, మైలారం పరిధిలో ఇద్దరికి అనర్హత వేటు వేశా రు. మోమిన్కలాన్ గ్రామ పంచా యతీ పరిధి లో ఒకరికి, మోమిన్ఖుర్దు పరిధిలో 6గురికి, మున్నూర్ సోమారం గ్రామ పంచాయతీ పరిధి లో ఒకరికి, నర్సపూర్ పరిధిలో ముగ్గురికి, పులి చింతల మడుగు తండా గ్రామ పంచా యతీ పరిధిలో ఇద్దరికి, రాజాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో నలుగురికి, రాంపూర్ తండా గ్రామ పంచాయతీ పరిధిలో ముగ్గురికి, రుద్రారం పరిధిలో ముగ్గురికి మొత్తం 68 మంది వార్డు సభ్యులకు గత పంచాయతీ ఎన్ని కల్లో ఎన్నికల వ్యయం సమర్పించక పోవడం తో అధికారులు అనర్హత వేటు వేశారు.
ముగ్గురు ఎంపీటీసీలపై ..
ధారూరు మండల పరిధిలోని 12ఎంపీటీసి ఉండగా గత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఎన్ని కల వ్యయం ఎన్నికల అధికారులకు సమర్పించక పోవడంతో ముగ్గురు ఎంపీటీసీలపై ఎన్నికల అధి కారులు అనర్హత వేటు వేశారు. మండల పరిధి లోని అల్లీపూర్ గ్రామ ఎంపీటీసీ కాళ్లపురం లక్ష్మి, నాగసముందర్ గ్రామ ఎంపీటీసి కానంగారి జగ దేవి, పులి చింతల మడుగు తండా ఎంపీటీసీ నేనావత్ మాణిక్యమ్మ వీరు ముగ్గురు గత ఎన్ని కల్లో వ్యయ వివరాలను ఎన్నికల అధికారులకు సమర్పించలేదు.దీంతో ఎన్నికల అధికారులు ముగ్గురు ఎంపీటీసీలపై అనర్హత వేటు వేశారు. ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధిం చాలని కోరుతూ సదరు ప్రజాప్రతి నిధులు హైకోర్టులో పిటిషన్ వేసినట్లు వారు తెలిపారు.
పంచాయతీలకు ప్రత్యేక అధికారులు
మండల పరిధిలోని ఐదు గ్రామాలు అంపల్లి, చింతకుంట, ధారూరు స్టేషన్, హరిదాస్పల్లి, మోమిన్ ఖుర్దు గ్రామాల్లో కోరం లేక ప్రత్యేక అధికారులను నియమించారు.