బొంరాస్‌పేట, అక్టోబర్ 31: మండలంలో వానకాలంలో సాగు చేసిన వరి పంటలు కోతకు సిద్ధంగా ఉన్నాయి. మం డలంలో 12 నోటిఫైడ్ చెరువులు, వంద వరకు కుంటలు ఉన్నాయి. వీటితో పాటు వందల సంఖ్యలో వ్యవసాయ బోర్లున్నాయి. వీటికింద రికార్డు స్థాయిలో వరి పంటను సాగు చేశారు. యాసంగిలో చెరువు లు, బోర్ల కింద 12వేల ఎకరా లలో వరి సాగు చేయగా, ఈ ఏడాది చెరువులు, కుంటల కింద 18,800 ఎకరాలలో వరి నాట్లు వేశారు. వరి ధాన్యానికి ప్రభుత్వం గిట్టుబాటు ధరలు కల్పించి గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొంటున్నది. కొన్న వారం రోజుల్లోనే రైతుల ఖాతా లలో డబ్బులు జమ చేస్తుం డడంతో రైతులు వరి సాగువైపు ఎక్కువగా మొగ్గు చూపారు. యాసంగిలో 8243 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, ఈ వానకాలంలో 41 వేల 360 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధి కారులు అంచనా వేస్తున్నా రు. అందుకు తగ్గట్టుగా ధాన్యం కొనడానికి ఏర్పాట్లు చేస్తు న్నారు. గత యాసంగిలో కొనుగోలు కేంద్రాల ద్వారా కొన్న ధాన్యాన్ని రైస్ మిల్లులు, రైతు వేదికల్లో నిల్వ చేశారు. ఈసారి కొనుగోలు చేసిన ధాన్యాన్ని స్థానికంగా ఉన్న రైస్ మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. దీనివల్ల కేంద్రాలలో తూకం చేసిన ధాన్యాన్ని వెంట వెంటనే తరలించే అవకాశం ఉంది.
18 ధాన్యం కొనుగోలు కేంద్రాలు
మండలంలో ధాన్యం కొనుగోలు కోసం యాసంగిలో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 18 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. నాగిరెడ్డిపల్లి, చిల్ముల్మైలార్ంల, చౌదర్పల్ల్లి, గౌరా రం, మెట్లకుంట, బొంరాస్‌పేట, దుద్యాల, ఏర్పుమళ్ల, నాందా ర్పూర్, బురాన్‌పూర్, తుంకిమెట్ల, ఈర్ల్లపల్లి, లగచెర్ల, రేగడిమై లారం, దుప్‌చెర్ల, కొత్తూరు, మదన్‌పల్లి, సాలిండాపూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈసారి కూ డా అంతే సంఖ్యలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తు న్నారు. వానకాలం వరికి ప్రభుత్వం మద్ధతు ధరను కూడా ప్రకటించింది. ఏ గ్రేడు ధాన్యానికి రూ.1960లు, బీ గ్రేడు ధా న్యానికి రూ.1940లుగా నిర్ణయించింది.
త్వరలో కేంద్రాలను ప్రారంభిస్తాం
ఈ నెల మొదటి వారంలో ధాన్యం కొనుగోలు కే్ంర దాలను ప్రారంభిస్తాం. వానకాలంలో ధాన్యం దిగుబడి ఎక్కు వగా వచ్చే అవకాశం ఉంది. అవసరమైతే కొనుగోలు కేం ద్రాలు పెంచుతాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుం డా ధాన్యం కొనుగోలు చేస్తాం.