ధారూరు, డిసెంబర్ 2: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం మండలంలోని పలు గ్రామాల రూపురేఖలను మార్చివేసినది. పల్లెప్రగతితోపాటు వివిధ రకాల ప్ర భుత్వ పథకాలను ఆయా గ్రామాల సర్పంచ్లు సద్వినియో గం చేసుకుంటూ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నా రు. ప్రభుత్వం సూచించిన ప్రత్యేక కార్యాచరణతో మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామకమిటీ సభ్యు లు, ప్రజలు ఉత్సాహంగా గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నా రు. గ్రామాల ముఖద్వారాల నుంచే రోడ్డుకు ఇరువైపులా హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలు స్వాగతం పలుకుతున్నాయి. మండల పరిధిలోని కొన్ని గ్రామాల్లోని వీధులు అద్దంలా మెరుస్తున్నాయి. అంతేకాకుండా సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీల నిర్మాణం, ఇండ్ల ఎదుట నాటిన పచ్చని మొ క్కలు, రాత్రివేళల్లో కాంతులు విరాజిల్లుతున్న విద్యుత్ లైట్లు పల్లెలకు కొత్తశోభను తీసుకొస్తున్నాయి. నర్సరీలు, పల్లె ప్రకృతి వనాల్లో ఎక్కువ సంఖ్యలో మొక్కల పెంపకం, డంపింగ్ యార్డులు, రైతు వేదిక భవనాలు, మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీరు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, ఇంకుడు గుం తలతో పల్లెలు అభివృద్ధి దిశలో దూసుకుపోతున్నాయి. గ్రామాల అభివృద్ధిని చూసి స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంతో ప్రతి గ్రా మంలో రూ.11.86 లక్షల చొప్పున వైకుంఠధామాల నిర్మాణం, రూ.2.5 లక్షలతో డంపింగ్ యార్డులు, మండల పరిధిలోని 7 క్లస్టర్ స్థాయి లో ఒక్కొక్క గ్రామానికి రూ.22 లక్షల చొప్పున రైతు వేదిక భవనాల నిర్మాణం, రైతులు ధాన్యం ఆరబెట్టుకునేందుకు కల్లాలను ఏర్పాటు చేశారు.
పారిశుధ్య నిర్వహణకు ప్రాధాన్యం
మండల పరిధిలోని గ్రామాల్లో పల్లె ప్రగతి లో భాగంగా డంపింగ్యార్డులను నిర్మించారు. అంతేకాకుండా ప్రతి గ్రామానికి పంచాయతీ నిధులతో ట్రాక్టర్లను కొనుగో లు చేశారు. ప్రతిరోజూ ఇంటింటికెళ్లి పం చాయతీ సిబ్బంది తడి, పొడి చెత్తను సేకరిస్తూ గ్రామాలను పరిశు భ్రంగా ఉంచుతున్నారు. అంతేకాకుండా గ్రామాల్లో ని విద్యుత్ స్తంభాలకు ఎల్ఈడీ బల్బులను ఏర్పాటు చేశారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతివనా ల్లో మొక్కలను నాటి వాటి చుట్టూ కంచెను ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ మొక్కలకు నీరు పోసి స్థానికులు వాటి సంరక్షణకు కృషి చేస్తున్నారు.
ఆదర్శ గ్రామంగా మార్చుతాం
గ్రామాభివృద్ధికి అందరూ సహకరిస్తున్నారు. గ్రామంలో వైకుంఠధామం, డంపింగ్ యా ర్డు, నర్సరీ, పల్లె ప్రకృతివనాన్ని ఏర్పాటు చే శాం. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీటిని అందిస్తున్నాం. దోర్నాల్ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తా.
పచ్చదనం, శుభ్రతకు అధిక ప్రాధాన్యం
గ్రామస్తుల సహకారంతో పల్లె ప్రగతి కార్యక్ర మం విజయవంతంగా కొనసాగింది. సర్పం చ్, పాలకవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధుల సహకారం మరువలేము. పార్టీలకతీతంగా పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. గ్రా మంలో పచ్చదనం, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. పారిశుధ్య సిబ్బంది గ్రామాన్ని నిత్యం పరిశుభ్రంగా ఉంచుతున్నారు.
రైతు వేదికల నిర్మాణం
మండల పరిధిలోని ధారూరు, నాగసముందర్, కెరెళ్లి, మోమిన్కలాన్, నాగారం, మున్నూర్సోమారం తదితర గ్రామాల్లో రైతు వేదిక భవనాలను ప్రభుత్వం నిర్మిం చింది. రైతులు ఏ పంటలు ఎప్పుడు వేయాలి తదితర విషయాలను వ్యవసాయా ధికారులను అడిగి తెలుసుకునేందుకు ఈ భవనాలు ఎంతగానో దోహదపడుతు న్నాయి. క్లస్టర్ స్థాయిలో మూడు, నాలుగు గ్రామాలు ఉండేలా, వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులో ఉండేలా రూ. 22 లక్షలతో వీటిని నిర్మించారు.