బొంరాస్పేట, డిసెంబర్ 2: వానకాలంలో కంది పంట ఆశా జనకంగా ఉంది. పప్పు ధాన్యాల పంటలైన పెసర, మిను ములు, బెబ్బర్లతో పాటు కందిని కూడా సాగు చేస్తారు. వర్షాధారం కింద రైతులు ఎక్కువగా కంది పంటను సాగు చేస్తారు. ప్రస్తుతం కంది పూత దశలో ఉంది. ఈ నెలాఖరు నుంచి పంట చేతికి వస్తుంది. అధిక వర్షాల వల్ల కొన్నిచోట్ల కంది పంట దెబ్బతిన్నా చాలా చోట్ల ఆశాజనకంగా ఉందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ పంట రక్షణకు రైతులు చర్య లు తీసుకుంటున్నారు. కాలానుగుణంగా మందులను పిచి కారీ చేస్తూ పంటలను కాపాడుకుంటున్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని మూడు మండలాల్లో ఎన్ఎఫ్ఎస్ఎం కింద సాగు చేసిన 5800 ఎకరాలను కలుపుకొని మొత్తం 45,098 ఎకరాలలో కంది పంటను సాగు చేశారు. బొంరాస్పేట మండలంలో 9831 ఎకరాలు, దౌల్తాబాద్ మండ లంలో 16594 ఎకరాలు, కొడంగల్ మండలంలో 18,673 ఎకరాలలో కంది పంటను సాగు చేశారు. దిగుబడులు ఆశాజనకంగా ఉండి మార్కెట్లో మంచి ధరలు వస్తాయని రైతులు ఆశిస్తున్నారు. గత ఏడాది కందికి మార్కెట్లో క్వింటాలుకు రూ.6500ల నుంచి రూ.7 వేల వరకు ధర పలికింది. ప్రస్తుతం కంది పప్పుకు ధర ఎక్కువగా నే ఉంది. గత ఏడాదిలాగానే ధర వస్తే రైతులకు లాభమే.
ఎన్ఎఫ్ఎస్ఎం కింద 5800 ఎకరాల్లో ..
పప్పు ధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా పథకం(ఎన్ఎఫ్ఎస్ఎం) కింద రైతు లకు ఉచితంగా కంది విత్తనాలను పంపిణీ చేసి పంటల సాగు ను ప్రోత్సహిస్తున్నది. ఈ ఏడాది కూడా నియోజకవర్గంలోని మూడు మండలాల్లో రైతులకు ఎల్ఆర్జి 176 రకం కంది విత్తనాలను వ్యవసాయాధికారులు ఉచితంగా రైతులకు పం పిణీ చేశారు. ఈ విత్తనాలతో రైతులు బొంరాస్పేట మం డలంలో 1900 ఎకరాలు, కొడంగల్ మండలంలో 1650 ఎకరాలు, దౌల్తాబాద్ మండలంలో 2250 ఎకరాలలో కంది పంటను సాగు చేశారు. రైతులకు వ్యవసాయాధికారులు ఎప్పటికప్పు డూ పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రతల గురించి వివరిస్తున్నారు. బొంరాస్పేట మండలంలోని ఎన్నెమీదితండాలో గోపాల్ నాయక్ అనే రైతు పొలంలో ఆత్మ, వ్యవసాయాధికారులు సంయుక్తంగా రెండు ఎక రా లలో రెండు వరుసల విధానంలో ప్రయోగాత్మకంగా కంది పంటను సాగు చేస్తున్నారు. ఈ విధానంలో సాగు చేసిన కంది బాగుందని వ్యవసాయాధికారులు తెలిపారు.