తమిళ అగ్ర నటుడు విజయ్ సేతుపతి ప్రధాన పాత్రధారిగా పూరీ జగన్నాథ్ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ సేతుపతి యాచకునిగా నటిస్తున్నాడని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు బెగ్గర్, భవతీ బిక్షాందేహి టైటిల్స్ మొదట్లో అనుకున్నారు. అయితే.. తాజాగా ఈ సినిమాకు. ‘స్లమ్‌డాగ్’ అనే పేరును పూరీ ఖరారు చేశారు.
ఇదో భిన్నమైన కథాంశమని, తన డైరెక్షన్‌తో హీరోయిజానికి కొత్త నిర్వచనం చెప్పిన పూరీ, నటనలో కొత్త ఒరవడి సృష్టించిన విజయ్ సేతుపతి కలయికలో వస్తున్న ఈ చిత్రం నిజంగా విలక్షణమేనని చిత్రబృందం చెబుతున్నది. పూరీ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్‌ను చెన్నైలో విడుదల చేయాలనుకున్నారు. విజయ్ ఎలక్షన్ ప్రచారంలో జరిగిన దుర్ఘటన దృష్ట్యా ఈ వేడుకను వాయిదా వేశారు. త్వరలోనే టైటిల్‌ను అధికారికంగా ప్రకటిస్తారు.