హబ్‌లు ఏర్పాటయ్యాయి. ఇవి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. సువిశాల విస్తీర్ణంలో రూ.150 కోట్లతో ఎడ్యుకేషన్ హబ్‌లు నిర్మించారు. బాలురు, బాలికల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లను ఏర్పాటు చేశారు. ఆరో తరగతి నుంచి పీజీ వరకు వివిధ కోర్సుల్లో నైపుణ్యం ఉన్న సిబ్బందితో ఉచితంగా బోధన చేస్తుండడంతో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ల నుంచి తీసి ఇక్కడ చేర్పిస్తున్నారు. ఎడ్యుకేషన్ హబ్‌లలో పాఠశాలలు, కళాశాల నిర్మాణాలు, వివిధ విభాగాల్లో అవసరమైన పరికరాలను అన్ని హంగులతో ఏర్పాటు చేశారు. ప్రైవేటు యూనివర్సిటీల కన్నా అద్భుతంగా హాస్టళ్లను నిర్మించారు. విద్యార్థుల సాంస్కృతిక, అవగాహన కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేకంగా ఆడిటోరియాలను అందుబాటులోకి తెచ్చారు. చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు తమ సత్తా చాటుతున్నారు.
ప్రభుత్వ విద్యా వ్యవస్థను పటిష్ట పరిచేందుకు సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యమిస్తున్నారు. కార్పొరేట్‌కు దీటుగా నాణ్యమైన విద్యతో పాటు అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నారు. గజ్వేల్‌లో సువిశాల విస్తీర్ణంలో రూ.150 కోట్లతో నిర్మించిన ఎడ్యుకేషన్ హబ్‌లు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. బాలురు, బాలికల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లను ఏర్పాటు చేసింది. ఆరో తరగతి నుంచి పీజీ వరకు వివిధ కోర్సుల్లో నైపుణ్యం ఉన్న సిబ్బందితో ఉచితంగా బోధన చేసుండడంతో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ల నుంచి తీసి ఇక్కడ చేర్పిస్తున్నారు. చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు తమ సత్తా చాటుతున్నారు.
గజ్వేల్, డిసెంబర్ 6 : విద్య ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు. ప్రభుత్వాలు ప్రజలకు కూడు, గూడు, గుడ్డ కల్పించడంతో పాటు సమగ్ర విద్యాబోధన అందిస్తేనే నేటి బాలలు రేపటి పౌరులై దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ హయాంలో విద్యకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఇందులోభాగంగా గజ్వేల్ పట్టణంలో రూ.150 కోట్ల వ్యయంతో దేశానికే ఆదర్శంగా నిర్మించిన ఎడ్యుకేషన్ హబ్‌లలో వేలాది మంది విద్యనభ్యసిస్తున్నారు. కేవలం గజ్వేల్ పట్టణం, నియోజకవర్గ విద్యార్థులను మేధావులుగా తీర్చిదిద్దడానికి ఏర్పాటు చేసిన ఈ ఎడ్యుకేషన్ హబ్‌లలో ఉమ్మడి జిల్లా విద్యార్థులు కూడా చదువుకుంటున్నారు. గతంలో పట్టణానికి దూరంగా భవనాలు నిర్మించినా పరిసరాల్లో ఆర్అండ్ఆర్ కాలనీ నిర్మాణం, గజ్వేల్ విస్తరించడంతో ప్రస్తుతం పట్టణం మధ్యలోనే ఎడ్యుకేషన్ హబ్‌లు ఉన్నాయి. విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా బస్టాండ్ నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కూడా కల్పించారు. బాలికలు, బాలురకు వేర్వేరుగా పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు ఉండడంతో దూరప్రాంత విద్యార్థులు గురుకులం తరహాలో విద్యను కొనసాగిస్తున్నారు. కొవిడ్ తర్వాత ప్రస్తుతం హాస్టళ్లలో డిగ్రీ, ఇంటర్ విద్యార్థులకు వసతిని కల్పిస్తున్నారు.
మహిళా ఎడ్యుకేషన్ హబ్
బాలికల విద్యను ప్రోత్సహిస్తూ అన్ని వసతులతో 6 నుంచి పీజీ వరకు ప్రత్యేక క్యాంపస్‌గా మహిళా ఎడ్యుకేషన్ హబ్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో డిగ్రీ, పీజీ, జూనియర్ కళాశాల, ఉన్నత పాఠశాలతో పాటు మోడల్ స్కూల్ కొనసాగుతుంది. డిగ్రీ కళాశాలలో బీకాం(సీఏ), బీఏ (హెచ్ఈపీ ఇంగ్లిష్/తెలుగు హెచ్‌పీపీ, ఈపీపీ), బీఎస్సీ (బీజడ్సీ, కంప్యూటర్ సైన్స్, బీటీబీసీ, బీటీజడ్సీ, ఎంజడ్సీ) కోర్సులను విద్యార్థులకు బోధిస్తున్నారు. అలాగే, పీజీలో ఎంఎస్సీ కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. డిగ్రీ కళాశాలలో ప్రస్తుత విద్యాసంవత్సరంలో 1050 మంది ఉండగా, ప్రథమ సంవత్సరంలోనే 360మంది కొత్తగా అడ్మిషన్ పొందారు. మరో విడత డిగ్రీ అడ్మిషన్లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వనుండగా ప్రథమ సంవత్సరం విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇంటర్ కళాశాలలో సీఈసీ, ఎంపీ సీ, బైపీసీ ఇంగ్లిష్/తెలుగు), హెచ్ఈసీ, ఎంఎల్టీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ, ఓఏ కోర్సులు ఉన్నాయి. జూనియర్ కళాశాలలో మొదటి సం వత్సరం 317, ద్వితీయ సంవత్సరం 353 మంది విద్యనభ్యసిస్తున్నారు. కళాశాలలో ఎంపీసీ, బైపీసీ కోర్సులను ఇంగ్లిష్ మీడియంలో కూడా బోధిస్తున్నారు. ఉన్నత పాఠశాలలో 512 మంది చదువుతున్నారు.
కార్పొరేట్ కన్నా … మోడల్ స్కూల్ ఎంతో మిన్న
గజ్వేల్ పట్టణంతో పాటు హైద్రాబాద్‌లోని పలు కార్పొరేట్ పాఠశాలల్లో విద్యాభ్యాసం చేసిన విద్యార్థులు కూడా మహిళా ఎడ్యుకేషన్ హబ్‌లోని మోడల్ స్కూల్లో చేరుతున్నారు. కరోనాకు ముందు ఆ తర్వాత కూడా ప్రైవేటు పాఠశాలల్లో బోధన నామమాత్రంగానే ఉండడం .. అదే సమయంలో మోడల్ స్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చడాన్ని చాలామంది తల్లిదండ్రులు గుర్తించారు. దీంతో తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో మాన్పించి మోడల్ పాఠశాలలో చేర్చారు. ఇక్కడ మొత్తం 780 మంది చదువుతుండగా, 10వ తరగతి వరకు 500మంది, ఇంటర్లో 280 మంది విద్యార్థులున్నారు. ఇంటర్మీయట్ విద్యార్థులకు ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ కోర్సుల్లో విద్యాబోధన చేస్తున్నారు.
బాలుర ఎడ్యుకేషన్ హబ్‌లో..
ఈ హబ్‌లో డిగ్రీ, పీజీ, బాలుర జూనియర్ కళాశాల, ఉన్నత పాఠశాలలు కొనసాగుతున్నాయి. డిగ్రీ, పీజీ కళాశాలల్లో గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన వారే కాకుండా వేరే జిల్లాల విద్యార్థులు కూడా చదివేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. కళాశాలలో బీఏ( హెచ్ఈపీ, ఈపీపీ), బీకాం కంప్యూటర్ అప్లికేషన్స్, బీఎస్సీ ( బీజడ్సీ, ఎంజడ్సీ, ఎంపీసీ, ఎంపీసీఎస్) కోర్సులను బోధిస్తున్నారు. అలాగే, పీజీలో (ఎంఏ ఎకనామిక్స్, తెలుగు), ఎంకామ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం కళాశాలలో 707 మంది చదువుతుండగా, డిగ్రీ ప్రవేశాలు పొందడానికి 4వ విడుతకు కూడా అవకాశం ఉండడంతో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశమున్నది. తాము చదవాలన్న కళాశాలను ఆన్లైన్లో వారే ఎంచుకునే వీలుండడంతో డిగ్రీ, పీజీ కళాశాల్లో ఎక్కువ మంది చేరుతున్నారు. ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో 545 మంది చదువుతున్నారు. కళాశాలలో సీఈసీ, ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, ఓఎ,ఎస్, ఎంటీ, ఈసీపీ కోర్సులతో పాటు ఎంపీసీ, బైపీసీ కోర్సులను ఇంగ్లిష్ మీడియంలో కూడా బోధిస్తున్నారు.
యూనివర్సిటీ స్థాయిలో హాస్టల్ వసతులు,
ప్రత్యేక ఆడిటోరియాలు
ఎడ్యుకేషన్ హబ్‌లలో పాఠశాలలు, కళాశాల నిర్మాణాలు, వివిధ విభాగాలలో అవసరమైన పరికరాలను అన్ని హంగులతో ఏర్పాటు చేశారు. ప్రైవేటు యూనివర్సిటీల కన్నా అద్భుతంగా హాస్టళ్లను నిర్మించారు. ప్రతి నలుగురికి ఒక ప్రత్యేక గది, అటాచ్డ్ బాత్రూం, ఒకేసారి అందరూ భోజనం చేయడానికి 520 మందికి సరిపడేలా క్యాంటీన్, స్నానానికి వేడినీళ్ల సౌకర్యం, పౌషికాహారం. ఇలా, విద్యార్థులకు అన్ని రకాల వసతులను అందిస్తున్నారు. బాలురు, బాలికల కోసం బీసీ, ఎస్సీ హాస్టళ్లు నిర్వహిస్తున్నారు. కళాశాల, పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక, అవగాహన కార్యక్రమాల నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఆడిటోరియంలను నిర్మించారు.
యూనివర్సిటీ వాతావరణం..
సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో గజ్వేల్ పట్టణంలో ఎడ్యుకేషన్ హబ్‌ల నిర్మాణం అద్భుతంగా జరిగింది. గతంలోని కళాశాలలు, పాఠశాలలతో పోల్చుకుంటే చాలా మార్పు వచ్చింది. కళాశాలలు, హాస్టళ్లలో ప్రైవేటు యూనివర్సిటీలకు మించి సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తున్నది. దీంతో కళాశాలల్లో విద్యాభ్యాసానికి యువత ఉత్సాహం చూపుతున్నారు. కళాశాలల్లో పటిష్ట విద్యాబోధనతో పాటు అన్ని వసతులను అందిస్తున్నాం.
-డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి ప్రిన్సిపాల్, ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాల, గజ్వేల్
మహిళా ప్రాంగణంతో విద్యార్థుల్లో మనోధైర్యం ఏర్పడింది
బాలికలకు ప్రస్తుత సమాజంలో భద్రతతో కూడిన విద్యను అందించాలని తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో మహిళా ఎడ్యుకేషన్ హబ్‌ను ఏర్పాటు చేశారు. దీంతో విద్యార్థుల సంఖ్య రెట్టింపైంది. హబ్ ప్రాంగణంలోని మహిళా డిగ్రీ, పీజీ కళాశాలల్లో చదువుకోవడానికి అధికసంఖ్యలో వస్తున్నారు. గజ్వేల్ ప్రాంతానికి చెందిన వారే కాకుండా ఇతర దూరప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. కేవలం బాలికలు మాత్రమే ఈ హబ్‌లో చదువుతుండడంతో తల్లిదండ్రుల్లో అభద్రతా భావం తొలిగింది. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాల బాగున్నాయని ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
-డాక్టర్ ఉమాశశి ప్రిన్సిపాల్, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, గజ్వేల్
విద్యార్థుల సంఖ్య పెరిగింది
ఎడ్యుకేషన్ హబ్‌లోకి పాఠశాల వచ్చిన తర్వాత వాతావరణం చాలా ఆహ్లాదకరంగా మారింది. చుట్టూ పచ్చని వాతావరణం, అద్భుతమైన భవనాలు, డిజిటల్ తరగతులు, ఎన్సీసీ తదితర అన్ని సౌకర్యాలు ఉన్నాయి. విద్యార్థుల సంఖ్య గతంలో 500ల వరకు ఉంటే ప్రస్తుత విద్యా సంవత్సరం వెయ్యి దాటింది. గజ్వేల్ పట్టణంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల నుంచి విద్యార్థులు వచ్చారు. పాఠశాలలో ప్రతి అధ్యాపకుడికి ఎంతో నైపుణ్యత ఉంది. దీంతో నాణ్యమైన విద్యను అందించగలుగుతున్నాము. కరోనా తర్వాత పారిశుధ్య నిర్వహణ కొంచెం ఇబ్బందిగా ఉంది. జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి పెడితే సమస్య పరిష్కారమవుతుంది.
-అరుణకుమారి, ప్రధానోపాధ్యాయురాలు, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల