హైదరాబాద్ : నిరుపేదల ఇండ్లను నిర్దయగా కూల్చివేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో నివసిస్తున్న పేదల పట్ల కర్కశంగానే ప్రవర్తిస్తున్నది. ఎవరు బయటకు వెళ్లొద్దు అని, కేటీఆర్‌తో మాట్లడకూడదని అధికారులు, కాంగ్రెస్ నాయకలు బెదిరింపులలకు పాల్పడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిన్న, మొన్న ఎందుకు రాలేదు అని అధికారులను అడిగితే మేము అందుబాటులో లేము అంటున్నారు. కానీ మాకు మద్దతు తెలిపేందుకు వస్తున్నవారిని కలువొద్దు అని చెప్పడం ఎంత వరకు సమంసం అని ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ వచ్చినప్పుడు బయటికి వస్తే మీ మీద కేసులు అవుతాయని రెవెన్యూ అధికారులు బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
కేటీఆర్ వచ్చినప్పుడు మీరు బయటికి రావొద్దు, కాంగ్రెస్ పార్టీని తిట్టొద్దని అధికారులు మాకు చెప్తున్నారు
నిన్న, మొన్న ఎందుకు రాలేదు అని అధికారులను అడిగితే మేము అందుబాటులో లేము అంటున్నారు
కేటీఆర్ వచ్చినప్పుడు బయటికి వస్తే మీ మీద కేసులు అవుతాయని రెవెన్యూ అధికారులు బెదిరిస్తున్నారు –… https://t.co/q6yn6bz9lq pic.twitter.com/70bOU4af7n
— Telugu Scribe (@TeluguScribe) February 26, 2026