హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఓఆర్ఆర్ ( ORR ) పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల వివరాలను పోలీసులు గుర్తించారు. వీరంతా సిరిసిల్ల ( Siricilla ) జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. సిరిసిల్ల వాసులు అయినప్పటికీ నగరంలోని సనత్నగర్ ప్రాంతంలో గత కొంతకాలంగా నివాసం ఉంటున్నారు.
శుక్రవారం ఉదయం యాదాద్రికి వెళ్లి ఓఆర్ఆర్పై నుంచి వస్తుండగా ఆగి ఉన్న లారీని అతివేగంగా వచ్చి ఢీ కొనడంతో ఆరుగురు మృతి చెందారు. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఓఆర్ఆర్ ఎగ్జిజ్ గేట్-16 వద్ద ఆగిఉన్న లారీనీ వెనుక నుంచి వచ్చిన టీఎస్ 23 ఎఫ్ 2298 అనే నంబర్ గల కారు ఢీకొట్టింది .
కొనఊపిరితో ఉన్న వ్యక్తిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. లారీ వెనుక భాగంలో చిక్కుకున్న కారును క్రేన్ సహాయంతో బయటకు తీశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. మృతుల్లో వ్యక్తి , ఇద్దరు మహిళలు, ముగ్గురు చిన్నారులు న్నారు. మృతులు శ్రీనివాస్, శివ, కృష్ణచంద్ర, మాధవ్, రిషిక , మరొకరి పేరు తెలియాల్సి ఉంది. తీవ్రంగా గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ పరిశీలించారు.