Mitchell Santner : ఐపీఎల్ నుంచి నిష్క్రమించిన మిచెల్ శాంట్నర్ (Mitchell Santner) తాజా పరిస్థితిపై న్యూజిలాండ్ క్రికెట్ (Newzealand Cricket) కీలక విషయం వెల్లడించింది. ఫీల్డింగ్ చేస్తూ గాయపడి టోర్నీని వీడిన శాంట్నర్ కోలుకునేందుకు నెలకు పైగా పట్టనుందని కివీస్ బోర్డు తెలిపింది. ఎడమ భుజానికి గ్రేడ్ త్రీ ఆంటెరోలాటెరల్ స్ట్రక్చర్స్ (ALS) గాయం అయినందును శాంట్నర్ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడని వెల్లడించింది.
పంతొమ్మిదో సీజన్ ఐపీఎల్లో గాయపడిన మిచెల్ శాంట్నర్ స్వదేశం చేరుకున్నాడు. అక్కడ స్పెషలిస్ట్ డాక్టర్‌ను కలిసి స్కానింగ్ పరీక్షలు చేయించుకున్నాడు. ఈ టెస్టుల్లో అతడి భుజం గాయం తీవ్రత బయటపడింది. గ్రేడ్ త్రీ ఏసీఎల్ గాయం అయినందున భుజం కండరాల్లోని లిగమెంట్ పూర్తిగా దెబ్బతిన్నదని తేలింది. దాంతో, అతడు కోలుకునేందుకు నెల రోజులు పడుతుందని న్యూజిలాండ్ క్రికెట్‌కు వైద్యులు చెప్పారు.
An update from the team. Read more at https://t.co/3YsfR1Y3Sm
📸 @PhotosportNZ pic.twitter.com/EN6KM7u5Om
— BLACKCAPS (@BLACKCAPS) May 1, 2026
ఫలితంగా ఐర్లాండ్‌తో జరుగబోయే ఏకైక టెస్టు, ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ఈ స్పిన్నర్ అందుబాటులో ఉండడని న్యూజిలాండ్ బోర్డు పేర్కొంది. ఐర్లాండ్‌తో మే 27న.. ఆపై ఇంగ్లండ్ గడ్డపై జూన్ 4న టెస్టు సిరీస్‌లో కివీస్ తలపడనుంది.
పంతొమ్మిదో సీజన్లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన శాంట్నర్ ఏప్రిల్ 23న మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ గాల్లోకి లేపిన బంతిని క్యాచ్ అందుకునే క్రమంలో అతడి ఎడమ భుజం, తల నేలకు గట్టిగా తగిలాయి. భుజం నొప్పితో మైదానం వీడిన శాంట్నర్‌కు స్కానింగ్ పరీక్షలు జరపగా.. కండరాల్లో చీలిక వచ్చినట్టు వైద్యలు గుర్తించారు. దాంతో, కంకషన్‌కు గురైన అతడి స్థానంలో శార్దూల్ ఠాకూర్ బ్యాటింగ్‌కు రావడం పెద్ద దూమారమే రేపింది.
Excellently judged 👌
Mitchell Santner with a fine diving catch in the deep 👏👏
1⃣st wicket of the night for Jasprit Bumrah ☝️
Updates ▶️ https://t.co/gGt34dqUoq#TATAIPL | #KhelBindaas | #MIvCSK | @mipaltan pic.twitter.com/5EyRNf9kCb
— IndianPremierLeague (@IPL) April 23, 2026
ముంబై జట్టు కంకషన్ నిబంధనను ఉల్లంఘించిందని విమర్శలు వచ్చాయి. కానీ, కోచ్ మహేల జయవర్ధనే మాత్రం తాము అంపైర్, రిఫరీ అనుమతితోనే శార్దూల్‌ను ఆడించామని వివాదానికి ముగింపు పలికాడు. శాంట్నర్‌కు వైద్యులు విశ్రాంతి సూచించడంతో అతడి స్థానంలో కేశవ్ మహరాజ్‌ను స్క్వాడ్‌లోకి తీసుకుంది ముంబై. ఈ సఫారీ స్పిన్నర్‌కు ముంబై ఫ్రాంచైజీ రూ.75 లక్షలు చెల్లించనుంది.