లక్షెట్టిపేట రూరల్ : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణానికి చెందిన నూటెంకి రవీంద్ర రాసిన ‘అతడే అలిగిన్నాడు’ గుండెను తాకే కవిత అని భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు రవీంద్రను అభినందిస్తూ పంపిన లేఖ గురువారం కవికి చేరింది. ఆయన లేఖ ద్వారా తన అభిప్రాయాన్ని రవీంద్రతో పంచుకుంటూ.. కవిత్వం అంటే ఊహాజనితం కాదని, వాస్తవికతకు దగ్గరగా ఉంటూ సహజంగా మనదైన బాషలో ఉండాలన్నారు. ప్రజలు ప్రతి సమస్యపై అవగాహన పెంచుకునేలా కవిత్వం ఉండాలన్నారు. ఈ సందర్బంగా కవి నూటెంకి రవీంద్ర మాట్లాడుతూ.. తన కవితను భారత ఉప రాష్ట్రపతి ప్రసంసించడం చాలా ఆనందంగా ఉందన్నారు.
తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కవిత్వం రాస్తున్నానని, నిరంతరం ప్రజల కోసమే కవిత్వం రాస్తానన్నారు. ఉప రాష్ట్రపతి అభినందించడంతో తనలో ఇంకా బాధ్యత పెరిగిందన్నారు.