Suriya 46 | కోలీవుడ్ యాక్టర్ సూర్య లక్కీ భాస్కర్ ఫేం వెంకీ అట్లూరితో చేస్తున్న చిత్రం సూర్య 46 (Suriya 46). ఈ మూవీలో ప్రేమలు ఫేం మమితా బైజు హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీకి సంబంధించి ఏదో ఒక వార్త నెట్టింట రౌండప్ చేస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ చిత్రానికి మేకర్స్ ఓ పేరు ఫైనల్ చేశారన్న వార్త ఆన్లైన్లో రౌండప్ చేస్తోంది.
తాజా టాక్ ప్రకారం ఈ చిత్రానికి విశ్వనాథం అండ్ సన్స్ (Vishwanadham and Sons) టైటిల్‌ను ఫిక్స్ చేశారని ఇన్సైడ్ టాక్. ఈ క్రేజీ టైటిల్ అఫీషియల్ అయితే ఇంతకీ సూర్యతో వెంకీ అట్లూరి ఎలాంటి కథను చూపించబోతున్నాడన్నది ఆసక్తికరంగా మారింది. అంతేకాదు ఈ మూవీని జులై 2026లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. సూర్య కరుప్పు విడుదలైన తర్వాత ప్రమోషన్స్‌ను షురూ చేయనున్నారట.
ఈ మూవీలో సీనియర్ యాక్టర్లు రాధికా శరత్ కుమార్, రవీనా టాండన్‌లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో సూర్య పాత్ర గజినీలో సంజయ్ రామస్వామి లైన్లో సాగనుందని టాక్ నడుస్తోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రం 45 ఏండ్ల వ్యక్తికి 20 ఏండ్ల యువతికి మధ్య రిలేషిన్ షిప్ నేపథ్యంలో ఉండబోతున్నట్టు సమాచారం.
సూర్య 46 చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశి, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో సూర్య టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. సూర్య మరోవైపు సుధాకొంగర డైరెక్షన్ల సూర్య 47లో నటిస్తున్నాడని తెలిసిందే.
Ram Pothineni | స్పీడు పెంచిన రామ్ పోతినేని .. ఒకేసారి రెండు ప్రాజెక్ట్స్ సెట్స్ పైకి..!
JrNTR | మెగా ట్విన్స్‌కు తారక్ వెల్కమ్.. వైరల్ అవుతున్న ఎన్టీఆర్ ట్వీట్!