Ram Pothineni | స్పీడు పెంచిన రామ్ పోతినేని .. ఒకేసారి రెండు ప్రాజెక్ట్స్ సెట్స్ పైకి..!
Ram Pothineni | ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తెలుగు సినీ పరిశ్రమలో తనదైన స్టైల్, డ్యాన్స్, ఎనర్జీతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో. 2006లో విడుదలైన ‘దేవదాసు’ సినిమాతో హీరోగా పరిచయమైన రామ్ తొలి చిత్రంతోనే భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు ఫిలింఫేర్ సౌత్ ఉత్తమ నూతన నటుడు అవార్డును సొంతం చేసుకున్నారు.
Ram Pothineni | ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తెలుగు సినీ పరిశ్రమలో తనదైన స్టైల్, డ్యాన్స్, ఎనర్జీతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో. 2006లో విడుదలైన ‘దేవదాసు’ సినిమాతో హీరోగా పరిచయమైన రామ్ తొలి చిత్రంతోనే భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు ఫిలింఫేర్ సౌత్ ఉత్తమ నూతన నటుడు అవార్డును సొంతం చేసుకున్నారు. కెరీర్ ప్రారంభంలో వరుస విజయాలతో దూసుకెళ్లిన ఆయనకు యువతలో ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అయితే గత కొన్నేళ్లుగా రామ్ సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రాకపోవడంతో సరైన బ్లాక్‌బస్టర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమాకు మంచి రివ్యూలు వచ్చినప్పటికీ కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని నమోదు చేయలేకపోయింది.
ఈ చిత్రానికి మహేష్ బాబు.పి దర్శకత్వం వహించగా కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించారు. ఈ ఫలితం రామ్‌ను మరింత జాగ్రత్తగా ఆలోచించేలా చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఈసారి కెరీర్లో స్పీడ్ పెంచి వరుస ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఆయన నిర్ణయించుకున్నారని సమాచారం. ప్రస్తుతం రామ్ ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్లో ఓ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సైన్ చేశారు. ఈ సినిమా ప్రీ–ప్రొడక్షన్ దశలో ఉండగానే మరో కొత్త కథకు కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను ఓ కొత్త దర్శకుడు తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. రామ్ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా పక్కా మాస్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈ కథ సిద్ధమైందని, ముఖ్యంగా కథలోని ప్రధాన పాయింట్ ఆయనను బాగా ఆకట్టుకోవడంతో వెంటనే ఓకే చెప్పారని సమాచారం.
ఆసక్తికర విషయం ఏమిటంటే ఆర్కా మీడియా సినిమా ప్రారంభం కాకముందే ఈ కొత్త దర్శకుడి చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లాలన్న ఆలోచనలో రామ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సినిమా ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే ఆర్కా మీడియా ప్రాజెక్ట్‌ను కూడా మొదలుపెట్టి రెండు సినిమాలను ప్యారలల్‌గా షూట్ చేయాలన్న వ్యూహంతో ముందుకు సాగుతున్నారని ఇండస్ట్రీ టాక్. ఒకవైపు అగ్ర నిర్మాణ సంస్థతో భారీ సినిమా చేస్తూనే మరోవైపు కొత్త టాలెంట్‌కు అవకాశం ఇవ్వడం ద్వారా తన కెరీర్‌కు కొత్త దిశ ఇవ్వాలని రామ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. హై వోల్టేజ్ యాక్షన్, మాస్ ఎలిమెంట్స్, కమర్షియల్ అప్పీల్ కలిగిన ఈ రెండు ప్రాజెక్టులు రామ్ కెరీర్‌ను మళ్లీ ట్రాక్‌పైకి తీసుకువస్తాయని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మొత్తానికి సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న రామ్ ఈసారి పక్కా ప్లానింగ్‌తో ఇండస్ట్రీలో తన స్థానం మరింత బలపర్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

