JrNTR | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు జన్మించిన వేళ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే వీరికి పలువురు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతుండగా తాజాగా అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక అభినందనలు తెలియజేశాడు.
తారక్ తన ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ.. ‘రామ్ చరణ్, ఉపాసనలకు కవలలు జన్మించినందుకు అభినందనలు. మీ కుటుంబం ఎల్లప్పుడూ ప్రేమ, ఆరోగ్యం మరియు ఆనందంతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను’. అంటూ తారక్ రాసుకోచ్చాడు. ఉపాసన శనివారం రాత్రి కవల పిల్లలకు జన్మనివ్వగా.. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ, తల్లి మరియు పిల్లలిద్దరూ క్షేమంగా ఉన్నారని తెలిపారు.
Congratulations to @AlwaysRamCharan and @upasanakonidela on their twins. ❤️ Wishing the family love, health and happiness.
— Jr NTR (@tarak9999) February 1, 2026