వేల్పూర్/ముప్కాల్, జనవరి 6 : ఎన్నిలక హామీలు అమలు చేయకుండా మోసగించిన కాంగ్రెస్‌కు మహిళలు తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా బాల్కొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 429 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు ఆయన చెక్కులు అందజేశారు. ఈసందర్భంగా వేముల మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు అవుతున్నా తులం బంగారం హామీ నెరవేర్చలేదని మండిపడ్డారు.
బీఆర్ఎస్లోకి కాంగ్రెస్ నేతలు
నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు మీసా ల శ్రీనివాస్, బాల్కొండ మండలం బో దేపల్లి ఉప సర్పంచ్ కోట అఖిలేశ్ తమ అనుచరులతో కలిసి బీఆర్ఎస్లో చేరా రు. వేముల ప్రశాంత్‌రెడ్డి వేల్పూర్‌లోని తన నివాసంలో వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు.