కొత్తగూడెం: తెలంగాణ ప్రజా సాహిత్యానికి పాదులు వేసి ప్రాణం పోసిన ప్రజల మనిషి వట్టికోట ఆళ్వారుస్వామి అని గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్ అన్నారు. సోమవారం వట్టికోట జయంతి వేడుకలు గ్రంథాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వట్టికోట చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. హోటల్ కార్మికుడిగా ప్రారంభమైన ఆయన జీవితం ఉద్యమాల వైపు నడిచిందని రచయితగా, కథకుడిగా, పాత్రికేయుడిగా, ప్రచురణకర్తగా తనదైన పాత్ర పోషించారని అన్నారు. ఈ కార్యక్రమంలో వరలక్ష్మీ, మృదుల, సిబ్బంది శైలజ,శివ, జయరాం,శంకర్, తదితరులు పాల్గొన్నారు.