RR vs CSK : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్‌ను రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) ఘనంగా ఆరంభించింది. ఆల్‌రౌండ్ షోతో చెన్నై సూపర్ కింగ్స్(CSK)ను వణికించిన రాజస్థాన్ 8 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. 128 పరుగుల స్వల్ప ఛేదనలో వైభవ్ సూర్యవంశీ(52), యశస్వీ జైస్వాల్(38 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగారు. వైభవ్ అయితే.. ఫోర్లు, సిక్సర్లతో చెన్నై బౌలర్లను హడలెత్తించాడు. 15 బంతుల్లోనే రికార్డు హాఫ్ సెంచరీతో ఈ చిచ్చరపిడుగు లక్ష్యాన్ని కరిగించగా.. యశస్వీ క్లాస్ ఇన్నింగ్స్‌తో అలరించాడు. బ్యాటింగ్, బౌలింగ్.. రెండు విభాగాల్లో దారుణంగా విఫలమైన సీఎస్కే ఘోర పరాభవం మూటగట్టుకుంది.
పంతొమ్మిదో సీజన్లో వరసగా రెండు భారీ స్కోర్ల మ్యాచ్‌ల తర్వాత లో స్కోరింగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ పంజా విసిరింది. ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు ముచ్చెమటలు పట్టిస్తూ భారీ విజయంతో బోణీ కొట్టింది. తొలుత సీఎస్కేను 127కే ఆలౌట్ చేసిన రాజస్థాన్.. వైభవ్ సూర్యవంశీ(52 : 17 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపులతో స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది.
Sharp work in the field! ⚡
Anshul Kamboj with an important breakthrough as Sarfaraz Khan takes a fine catch in the deep 🤝
Updates ▶️ https://t.co/UzbuFk5G26#TATAIPL | #KhelBindaas | #RRvCSK | @ChennaiIPL pic.twitter.com/AzRULVrSTW
— IndianPremierLeague (@IPL) March 30, 2026
తొలుత బౌలర్లు చెన్నైను 127 కట్టడి చేయగా ఓపెనర్లు ధాటిగా ఇన్నింగ్స్ మొదలెట్టారు. మ్యాట్ హెన్రికి చుక్కలు చూపిస్తూ వైభవ్ సూర్యవంశీ(52) 4, 6 బాదగా యశస్వీ జైస్వాల్(38 నాటౌట్) చివరి బంతిని బౌండరీ దాటించాడు. అన్షుల్ కంబోజ్ వేసిన ఐదో ఓవర్లో రెచ్చిపోయిన వైభవ్.. రెండు ఫోర్లు, సిక్సర్‌తో 15 పరుగులు పిండుకున్నాడు. పవర్ ప్లేలో వరుసగా రెండు సిక్సర్లతో 15 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడీ హిట్టర్. అతడి విధ్వంసంతో పవర్ ప్లేలో 74 రన్స్ చేసింది రాజస్థాన్.
Sharp work in the field! ⚡
Anshul Kamboj with an important breakthrough as Sarfaraz Khan takes a fine catch in the deep 🤝
Updates ▶️ https://t.co/UzbuFk5G26#TATAIPL | #KhelBindaas | #RRvCSK | @ChennaiIPL pic.twitter.com/AzRULVrSTW
— IndianPremierLeague (@IPL) March 30, 2026
ఆ తర్వాతి ఓవర్లోనే సర్ఫరాజ్ డైవింగ్ క్యాచ్‌తో సూర్యవంశీ ఔటయ్యాడు. ధ్రువ్ జురెల్(18) వస్తూనే బౌండరీలతో సీఎస్కే బౌలర్లను హడలెత్తించాడు. కంబోజ్ ఓవర్లో స్కూప్ షాట్ ఆడాలనుకున్న జురెల్ దురదృష్టవశాత్తూ బంతిని వికెట్ల మీదకు ఆడుకున్నాడు. అప్పటికే రాజస్థాన్ విజయం వాకిట నిలవగా యశస్వీతో కలిసి కెప్టెన్ రియాన్ పరాగ్(14 నాటౌట్) లాంఛనం పూర్తి చేశారు. నూర్ అహ్మద్ ఓవర్లో బ్యాక్వర్డ్ పాయింట్లో పరాగ్ సిక్సర్, హెన్రీ వేసిన 12వ ఓవర్ తొలి బంతిని యశస్వీ స్టాండ్స్‌లోకి పంపడంతో 8 వికెట్ల తేడాతో రాజస్థాన్ బోణీ కొట్టింది.
గువాహటిలో రాజస్థాన్ రాయల్స్ పేసర్ల విజృంభణతో టాపార్డర్ చేతులెత్తేయగా చెన్నై స్కల్ప స్కోర్‌కే పరిమితమైంది. టాస్ ఓడిన సీఎస్కేకు శుభారంభం లభించలేదు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(6)తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన సంజూ శాంసన్(6)ను నంద్రె బర్గర్(2-26) బౌల్డ్ చేశాడు. డిఫెన్స్ ఆడాలనుకున్న అతడి అంచనా తప్పగా బంతి ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది. ఆ తర్వాతి ఓవర్లో గైక్వాడ్‌ను ఆర్చర్ ఔట్ చేయగా.. ఆయుష్ మాత్రే(0)ను బర్గర్ పెవిలియన్ చేర్చాడు.

బర్గర్, ఆర్చర్ విజృంభణతో పవర్ ప్లేలోనే నాలుగు వికెట్లు పడ్డాయి. ఆ దశలో ఇంప్యాక్ట్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్(17) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ, జడేజా అతడిని ఎల్బీగా ఔట్ చేయగా.. చెన్నై 51కే ఐదు వికెట్లు కోల్పోయింది. ఆవెంటనే సిక్సర్ బాదిన శివం దూబే(6)ను సైతం జడ్డూ ఔట్ చేసి చెన్నైని మరింత కష్టాల్లోకి నెట్టాడు. ప్రధాన ఆటగాళ్లు విఫలమైనా కార్తిక్ శర్మ(18), జేమీ ఓవర్టన్(43)లు గొప్పగా ఆడారు. సందీప్ శర్మ ఓవర్లో బౌండరీతో సీఎస్కే స్కోర్ వంద దాటించాడు ఓవర్టన్. అన్షుల్ కంభోజ్ (7 నాటౌట్) రెండు ఫోర్లు బాదగా.. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో ఓవర్టన్ సిక్స్ బాదగా చెన్నై 127 పరుగులకే ఆలౌటైంది.