RR vs CSK | నిప్పులు చెరిగిన బర్గర్, ఆర్చర్.. స్వల్ప స్కోర్‌కే కుప్పకూలిన చెన్నై..!
RR vs CSK : ఐపీఎల్ లీగ్ దశ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు చేతులెత్తేశారు. నంద్రె బర్గర్(2-26), జోఫ్రా ఆర్చర్(2-19)ల ధాటికి టాపార్డర్ కుప్పకూలగా.. మిడిలార్డర్‌ను రవీంద్ర జడేజా(2-18) పడగొట్టాడు.
RR vs CSK : ఐపీఎల్ లీగ్ దశ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్(CSK) బ్యాటర్లు చేతులెత్తేశారు. నంద్రె బర్గర్(2-26), జోఫ్రా ఆర్చర్(2-19)ల ధాటికి టాపార్డర్ కుప్పకూలగా.. మిడిలార్డర్‌ను రవీంద్ర జడేజా(2-18) పడగొట్టాడు. 51కే సగం వికెట్లు పడిన చెన్నై వంద లోపే కుప్పకూలేలా కనిపించింది. కానీ, కార్తిక్ శర్మ(18), టెయిలెండర్ జేమీ ఓవర్టన్(43)లు అద్భుతంగా పోరాడారు. సందీప్ శర్మ ఓవర్లో ఓవర్టన్ సిక్సర్ బాది ఐదుసార్లు ఛాంపియన్‌కు గౌరవప్రదమైన స్కోరందించాడు.
పంతొమ్మిదో సీజన్లో వరుసగా రెండు మ్యాచుల్లో రెండొందల స్కోర్ నమోదవ్వగా.. చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం తడబడింది. గువాహటిలో రాజస్థాన్ రాయల్స్ పేసర్ల విజృంభణతో టాపార్డర్ చేతులెత్తేయగా చెన్నై స్కల్ప స్కోర్‌కే పరిమితమైంది. టాస్ ఓడిన సీఎస్కేకు శుభారంభం లభించలేదు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(6)తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన సంజూ శాంసన్(6)ను నంద్రె బర్గర్(2-26) బౌల్డ్ చేశాడు. డిఫెన్స్ ఆడాలనుకున్న అతడి అంచనా తప్పగా బంతి ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది. ఆ తర్వాతి ఓవర్లో గైక్వాడ్‌ను ఆర్చర్ ఔట్ చేయగా.. ఆయుష్ మాత్రే(0)ను బర్గర్ పెవిలియన్ చేర్చాడు.
A special return in Pink for Ravindra Jadeja 🩷
🎥 Two quick wickets in his very first over back for the Royals 🔥
Updates ▶️ https://t.co/UzbuFk5G26#TATAIPL | #KhelBindaas | #RRvCSK | @rajasthanroyals | @imjadeja pic.twitter.com/leq4EyMRha
— IndianPremierLeague (@IPL) March 30, 2026
జడ్డూ జాదూ
బర్గర్, ఆర్చర్ విజృంభణతో పవర్ ప్లేలోనే నాలుగు వికెట్లు పడ్డాయి. ఆ దశలో ఇంప్యాక్ట్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్(17) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ, సుదీర్ఘ విరామం తర్వాత రాజస్థాన్‌కు ఆడుతున్న జడేజా తొలి ఓవర్లోనే తన మ్యాజిక్ చూపించాడు. పెద్ద షాట్లకు సిద్ధమైన సర్ఫరాజ్‌ను ఎల్బీగా ఔట్ చేయగా.. చెన్నై 51కే ఐదు వికెట్లు కోల్పోయింది.
ఆవెంటనే సిక్సర్ బాదిన శివం దూబే(6)ను సైతం జడ్డూ ఔట్ చేసి చెన్నైని మరింత కష్టాల్లోకి నెట్టాడు. ప్రధాన ఆటగాళ్లు విఫలమైనా కార్తిక్ శర్మ(18), జేమీ ఓవర్టన్(43)లు గొప్పగా ఆడారు. సందీప్ శర్మ ఓవర్లో బౌండరీతో సీఎస్కే స్కోర్ వంద దాటించాడు ఓవర్టన్. అన్షుల్ కంభోజ్ (7 నాటౌట్) రెండు ఫోర్లు బాదగా.. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో ఓవర్టన్ సిక్స్ బాదగా చెన్నై 127 పరుగులకే ఆలౌటైంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
Navaratri Brahmotsavams | తిరుమలలో వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

