పాల్వంచ, మే 05 : నవ భారత్ కంపెనీ పాల్వంచ వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ కార్యక్రమంలో భాగంగా పాల్వంచలోని శేఖరం బంజర్ లో గల అర్బన్ హెల్త్ సెంటర్ లో వ్యాక్సిన్ రూమ్ ను నిర్మించారు. దీనిని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్బన్ హెల్త్ సెంటర్ శేఖర బంజర మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కృష్ణ కుమారి మాట్లాడుతూ.. వాక్సిన్ సమయంలో రోగులు ఎదురుకుంటున్న సమస్యలను నవ లిమిటెడ్ మేనేజ్మెంట్ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించి మూడు నెలల్లోనే వాక్సిన్ రూమ్ ను నిర్మాణం చేసి అప్పగించడం జరిగిందన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ మాట్లాడుతూ.. పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలో రోగుల కోసం వెయిటింగ్ రూమ్
నిర్మించడం, కొవిడ్ సమయంలో సెంట్రల్ ఆక్సిజన్ సిస్టమ్ ను ఏర్పాటు చేయడం, ప్రభుత్వ ఆస్పత్రుల బలోపేతానికి నవ లిమిటెడ్ చేస్తున్న కృషిని కొనియాడారు. డి.జి.ఎమ్ సి.హెచ్ శ్రీకాంత్ మాట్లాడుతూ నవ లిమిటెడ్ చేస్తున్న ఆరోగ్యం, విద్య, జీవనోపాదుల కార్యక్రమలను వివరించారు. ఈ కార్యక్రమంలో సి.ఎస్.ఆర్ మేనేజర్, సి.హెచ్. శ్రీనివాసరావు, సివిల్ ఇంజినీర్ ఫణింధ్రచారి, కరుణాకర్, వైద్య సిబ్బంది, గ్రామ ప్రజలు, సి.ఎస్.ఆర్ సిబ్బంది పాల్గొన్నారు.