న్యూఢిల్లీ: ఆకారాన్ని, నడకను మార్చుకొనే రోబోలను అమెరికా పరిశోధకులు తయారు చేశారు. ఇవి వస్తువులను పట్టుకోవడం, ఎత్తడం కూడా చేస్తాయి. మెటీరియల్ షీట్ల పదార్థాల నుంచి అభివృద్ధి చేసిన ఈ కొత్త రకం రోబోలు మోటార్ లేనప్పటికీ అనేక పనులు చేయగలవు.
ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి దూసుకుపోగలవు. ఈ కొత్త రోబోలు వందలాది స్థిరమైన ఆకారాలలో దూసుకుపోగలవు. వివిధ రకాల ఆకారాల్లోకి మారిపోయి దూసుకుపోయే సామర్థ్యాన్ని ఇవి కలిగి ఉన్నాయి. అమెరికా నార్త్ కరోలినా స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల బృందం అభివృద్ధి చేసిన ఈ మెటా రోబోలు ఉపరితలం చుట్టూ కదలగలవు. వస్తువులను పట్టుకోగలవని తెలిపారు.