న్యూఢిల్లీ: ఆఫ్రికా దేశం మొజాంబిక్‌లో బెయిరా ఓడరేవు సమీపంలో పడవ ప్రమాదానికి గురై ముగ్గురు భారతీయులు మృతి చెందారు. మరో ఐదుగురి ఆచూకీ గల్లంతైంది. 14 మంది భారతీయు సిబ్బందితో సహా మరికొందరిని తీసుకెళ్తున్న పడవ సముద్రంపై బోల్తా పడినట్టు భారత హైకమిషన్ శనివారం ధ్రువీకరించింది.
ఈ ఘటనలో కొంతమందిని స్థానిక సిబ్బంది రక్షించినట్టు తెలిపింది. బెయిరా ఓడరేవు వద్ద సిబ్బంది బదిలీ ఆపరేషన్ల సమయంలో ఈ ప్రమాద ఘటన జరిగినట్టు వెల్లడించింది.