న్యూఢిల్లీ: భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్) సీటా అనే ఒక కొత్త ఆవిష్కరణ చేసింది. భారత దేశ డిజిటల్ గుర్తింపు పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి, డీప్ ఫేక్, స్ఫూఫింగ్, ప్రెజెంటేషన్ దాడులు వంటి భద్రతా బెదిరింపులను ఎదుర్కోవడానికి సీటాను ప్రారంభించింది. భారత దేశం డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బలోపేతం చేయడానికి, సమగ్ర గుర్తింపు పర్యావరణ వ్యవస్థను నిర్ధారించడానికి సీటా కార్యక్రమం ఒక ముఖ్యమైన అడుగు అని ఉడాయ్ అధికారులు తెలిపారు.
ఇది ఆత్మనిర్భర్ భారత్ నినాదానికి మద్దతు ఇస్తుంది. ఆధార్‌తో ఇన్నోవేషన్, టెక్నాలజీ అసోసియేషన్ పథకం (సిటా) కోసం దరఖాస్తులు నవంబర్ 15 వరకు స్వీకరిస్తారు. ఆధార్ ప్రామాణికతను మెరుగుపర్చటం సహా బెంచ్ మార్క్ సొల్యూషన్లను, స్టార్టప్‌లు, విద్యాసంస్థలు, పరిశ్రమల నిపుణులను ఒక చోట చేర్చడం సీటా లక్ష్యం.