న్యూఢిల్లీ: రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలకవ్యాఖ్యలు చేశారు. ఆ దేశం నుంచి భారత్ ఇక చమురు కొనుగోలు చేయదని మళ్లీ ప్రకటించారు. ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ మౌనం వహించడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబట్టింది.
ఆపరేషన్ సిందూర్ను ఆపేశానంటూ, రష్యా ఇంధన కొనుగోళ్లను భారత్ తగ్గిస్తుందంటూ ట్రంప్ చెప్పినప్పుడల్లా..ఆయన మంచి స్నేహితుడు అకస్మాత్తుగా మౌనీ బాబా అయిపోతారు’ అంటూ జైరామ్ రమేశ్ విమర్శలు చేశారు. ఎక్స్ వేదికగా ఆయన ప్రధానిపై విమర్శలు గుప్పించారు.