లేహ్, అక్టోబర్ 18: లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా, భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ లేహ్ అపెక్స్ బాడీ (ఎల్ఏబీ), కార్గిల్ డెమొక్రటిక్ అలయెన్స్ (కేడీఏ) ఆధ్వర్యంలో జరిగిన మౌన ప్రదర్శన యత్నాన్ని శనివారం లేహ్‌లో అధికారులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పటిష్ఠ బందోబస్తుతో పాటు, ఇంటర్నెట్ నిలిపివేత, నిషేధ ఉత్తర్వులు అమలు చేశారు.
అయితే పోలీసులు, పారా మిలిటరీ దళాలు వారి ప్రయత్నాలను అడ్డుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా విద్యాసంస్థలను మూసివేశారు. కాగా, లేహ్‌లో మౌన ప్రదర్శనపై ఆంక్షలు విధించడాన్ని నిరసిస్తూ కేడీఏ ఆధ్వర్యంలో కార్గిల్‌లో శాంతియుత ప్రదర్శన నిర్వహించారు. లేహ్‌లో సెప్టెంబర్ 24న జరిగిన ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించడాన్ని ఎల్ఏబీ, కేడీఏ ఆహ్వానించాయి.