America | అమెరికా (America) అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు భారీ షాక్ తగిలింది. అమెరికాలో జరిగిన స్థానిక ఎన్నికల్లో (local elections) రిపబ్లికన్ (Republicans) పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కీలకమైన న్యూయార్క్ మేయర్ స్థానం సహా పలుచోట్ల ట్రంప్ పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో అత్యంత కీలకంగా మారిన న్యూయార్క్ నగర (New York City) మేయర్ పదవిని డెమోక్రటిక్ పార్టీకి చెందిన జోహ్రాన్ మమ్దానీ (Zohran Mamdani) కైవసం చేసుకున్నారు. ఆయన భారత సంతతికి చెందిన వ్యక్తి కావడం విశేషం. ఇక మమ్దానీ ఓటమి కోసం స్వయంగా ట్రంప్ ప్రచారం చేయడం గమనార్హం.
ఇక వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ (Virginias New Lieutenant Governor) ఎన్నికల్లో కూడా భారత సంతతికి చెందిన డెమోక్రటిక్ అభ్యర్థిని గజాలా హాష్మీ (Ghazala Hashmi) విజయం సాధించారు. అంతేకాదు పలు స్థానిక ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో ఓన్నికల్లో ఓటమిపై అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఇందుకు రెండు కారణాలు ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌లో పోస్టు పెట్టారు. ‘ఓడిపోవడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. బ్యాలెట్‌పై నా పేరు లేకపోవడం, షట్‌డౌన్. ఎన్నికల్లో రిపబ్లికన్లు ఓడిపోవడానికి ఈ రెండు కారణాలే’ అని ట్రంప్ పేర్కొన్నారు.
న్యూయార్క్ (New York City) మేయర్ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ (Zohran Mamdani) విజయం సాధించారు. ఈ ఘనత సాధించిన తొలి ముస్లిం (Muslim mayor), భారత సంతతి, ఆఫ్రికన్ సంతతికి చెందిన తొలి మేయర్‌గా ఆయన రికార్డు సృష్టించారు. 34 ఏండ్ల మమ్దానీ జూన్‌లో జరిగిన డెమోక్రాటిక్ ప్రైమరీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి మేయర్ అభ్యర్థిగా నిలిచారు. తాజాగా జరిగిన మేయర్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమోపై మమ్దానీ విజయం సాధించారు.
వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ (Virginias New Lieutenant Governor)గా భారత సంతతికి చెందిన డెమోక్రటిక్ అభ్యర్థిని గజాలా హాష్మీ (Ghazala Hashmi) విజయం సాధించారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి జాన్ రీడ్‌పై భారీ మెజారిటీతో గెలుపొందారు. హాష్మీ 15వ సెనెటోరియల్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వర్జీనియా సెనేట్‌లో పనిచేసిన మొదటి ముస్లిం, తొలి దక్షిణాసియా అమెరికన్ గజాలా. ఈమె భారత సంతతికి చెందిన మహిళే కాదు.. హైదరాబాద్ వాసి కూడా.
Also Read..
Ghazala Hashmi | వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా.. హైదరాబాదీ మహిళ గజాలా హాష్మీ
Zohran Mamdani | అమెరికాలో భారత సంతతి హవా.. న్యూయార్క్ మేయర్‌గా జోహ్రాన్ మమ్దానీ విజయం
US Plane Crash | అమెరికాలో కుప్పకూలిన విమానం.. ముగ్గురు మృతి, 11 మందికి తీవ్ర గాయాలు