Anti Infectives | బ్యాక్టీరియా లేదా వైరస్ ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు మనకు భిన్న రకాల రోగాలు వస్తాయి. చాలా మందికి ఈ ఇన్ఫెక్షన్లతో ముందుగా జ్వరం వస్తుంది. అది తీవ్రతరం అయ్యాక మనం చికిత్స తీసుకుంటాం. డాక్టర్లు మనకు బ్యాక్టీరియా అయితే యాంటీ బయాటిక్స్, వైరస్ ఇన్ఫెక్షన్ అయితే యాంటీ వైరల్ మందులను ఇస్తారు. దీని వల్ల ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది. సూక్ష్మ క్రిములను తట్టుకునే శక్తి మనకు లభిస్తుంది. అయితే ఈ ఇన్ఫెక్షన్లు వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. కానీ ఇన్ఫెక్షన్ ఏదైనా సరే మన ఇంట్లోనే ఉండే కొన్ని పదార్థాలు సహజసిద్ధమైన యాంటీ బయాటిక్స్, యాంటీ వైరల్ మందులుగా పనిచేస్తాయి. కనుక ఇన్ఫెక్షన్ వచ్చిన వారు డాక్టర్ ఇచ్చిన మందులతోపాటు ఆయా పదార్థాలను తీసుకోవాలి. దీని వల్ల ఇన్ఫెక్షన్ నుంచి త్వరగా బయట పడవచ్చు. జ్వరం కూడా త్వరగా తగ్గిపోతుంది. రోగ నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారు.
అల్లాన్ని మనం తరచూ వంటల్లో వేస్తుంటాం. దీని వల్ల వంటకాలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే అల్లం సహజసిద్ధమైన యాంటీ బయాటిక్, యాంటీ వైరల్ గుణాలను కలిగి ఉంటుంది. అలాగే ఇందులో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు కూడా ఉంటాయి. కనుక ఇది ఒక్కటే అనేక ఇన్ఫెక్షన్లకు మందుగా పనిచేస్తుంది. అల్లంలో జింజరాల్, టర్పెనాయిడ్స్, షోగోల్స్, జెరుమ్బొన్, జింజరోన్ అనే సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. అలాగే శక్తివంతమైన ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవన్నీ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. బ్యాక్టీరియా, వైరస్లపై పోరాటం చేస్తాయి. కనుక అల్లం రసంను రోజూ తీసుకుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. దీన్ని రోజుకు 2 సార్లు భోజనానికి ముందు ఒక టీస్పూన్ మోతాదులో తాగాలి. దీని వల్ల అన్ని రకాల ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి. ముఖ్యంగా బ్యాక్టీరియా, వైరస్ ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే జ్వరం తగ్గుతుంది. అల్లం రసం తాగకపోయినా నేరుగా చిన్న అల్లం ముక్కను తీసుకుని నోట్లో వేసుకుని బాగా నమిలి మింగాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తున్నా కూడా ఉపయోగం ఉంటుంది.
ఉల్లిపాయలను కూడా మనం రోజూ వంటల్లో వేస్తుంటాం. ఉల్లిపాయలు లేకుండా అసలు కూరలను చేయరు. ఉల్లిపాయల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. వీటిల్లో సల్ఫర్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఈ సమ్మేళనాలను సిస్టీన్ సల్ఫాక్సైడ్స్ అని పిలుస్తారు. అలాగే ఉల్లిపాయల్లో శక్తివంతమైన ఫ్లేవనాయిడ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ యాంటీ బయాటిక్, యాంటీ వైరల్ గుణాలను కలిగి ఉంటాయి. కనుక రోగాలను తగ్గిస్తాయి. రోజూ భోజనంలో పచ్చి ఉల్లిపాయలను రెండు పూటలా తింటుంటే ఎంతో మేలు జరుగుతుంది. ఉల్లిపాయల్లో ఫైటో న్యూట్రియెంట్స్ సైతం అధికంగా ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్లపై నేరుగా పోరాటం చేస్తాయి. వ్యాధులను తగ్గేలా చేస్తాయి. కనుక బ్యాక్టీరియా, వైరస్ ఇన్ఫెక్షన్లు ఉన్నవారు ఉల్లిపాయలను తింటుంటే ఉపయోగం ఉంటుంది. వ్యాధులను త్వరగా తగ్గించుకోవచ్చు.
ఉల్లిపాయల్లాగే వెల్లుల్లి కూడా మనకు ఎంతో మేలు చేస్తుంది. దీన్ని కూడా మనం రోజూ వంటల్లో వేస్తుంటాం. ఇది వంటలకు చక్కని రుచి, వాసనను అందిస్తుంది. వెల్లుల్లిలో ఆల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది బ్యాక్టీరియా, వైరస్లపై పోరాటం చేస్తుంది. ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. రోజూ ఉదయం పరగడుపునే రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను తింటుంటే ఉపయోగం ఉంటుంది. వీటిని నేరుగా తినవచ్చు. లేదా కాస్త వేయించి కూడా తినవచ్చు. అలాగే తేనె కూడా ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. ఇవి రోగాలను నయం చేస్తాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రోజూ రెండు పూటలా ఒక టీస్పూన్ మోతాదులో తేనెను తీసుకుంటుంటే ఎంతగానో ఉపయోగం ఉంటుంది. అలాగే ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో పసుపు కూడా అద్బుతంగా పనిచేస్తుంది. రోజూ రాత్రి పూట ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కొద్దిగా పసుపు కలిపి తాగుతుంటే ఇన్ఫెక్షన్లను తగ్గించుకోవచ్చు. ఇలా ఆయా వంటింటి పదార్థాలు ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తాయి.