Iran war | ఇరాన్‌పై భీకర దాడులకు దిగిన అమెరికా సైన్యం.. హర్మూజ్‌ను క్లోజ్ చేసిన ఇరాన్
Iran war | పశ్చిమాసియాలో( Iran war )మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్‌ను కూల్చివేసిన ఘటనకు ప్రతిస్పందనగా అమెరికా జరిపిన వైమానిక దాడుల తర్వాత ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలో ప్రతీకార దాడులకు దిగింది.
హైదరాబాద్ : పశ్చిమాసియాలో( Iran war )మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్‌ను కూల్చివేసిన ఘటనకు ప్రతిస్పందనగా అమెరికా జరిపిన వైమానిక దాడుల తర్వాత ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలో ప్రతీకార దాడులకు దిగింది. ఈ నేపథ్యంలో టెహ్రాన్‌ను లక్ష్యంగా చేసుకొని అమెరికా సైన్యం(US military) క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్‌లోని కీలక లక్ష్యాపై భీకర దాడులు చేస్తోంది. ఇరాన్ దూకుడు చర్యలక సమాధానంగానే తాము దాడులు చేస్తున్నామని అమెరికా తెలిపింది.
ఈ దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. హోర్ముజ్ జలసంధి ద్వారా 10 కోట్ల బ్యారెళ్ల చమురు తరలించామని తెలిపారు. హోర్ముజ్ ద్వారా 200 నౌకలు సురక్షితంగా తరలించామన్నారు. అమెరికా దాడుల నేపథ్యంలో హోర్ముజ్‌ను మూసివేస్తున్నట్లు ఇరాన్ వెల్లడించింది. హెచ్చరికలు పక్కనపెట్టి హోర్ముజ్ దాటితే దాడులు తప్పవని హెచ్చరించింది.
ఇరాన్‌పై దాడులు కొనసాగిస్తాం: ట్రంప్
ఇరాన్‌పై తమ దాడులు కొనసాగిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. కువైట్, బహ్రెయిన్, జోర్డాన్ల్లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇస్లామిక్ రిపబ్లిక్ దాడులు చేస్తున్న క్రమంలో ఇరాన్‌పై మరిన్ని దాడులకు సంసిదులవుతున్నట్టు చెప్పారు. ఈసారి విద్యుత్తు ప్లాంట్లు, వంతెనలను లక్ష్యంగా దాడులు చేయాలని ఆదేశించనున్నట్టు తెలిపారని ఫాక్స్ న్యూస్ వెల్లడించింది. తమకు చెందిన అపాచీ హెలికాప్టర్‌ను ఇరాన్ కూల్చివేసిన విషయాన్ని ట్రంప్ అంగీకరించారు.
దౌత్య చర్చల ప్రయత్నాలు కనుక నిలిచిపోతూనే ఉంటే సైనిక దాడులను మరింత ఉద్ధృతం చేస్తామని ఆయన తెలిపారు. వారు బతికి బట్టకట్టడానికి ఒప్పదంపై సంతకం చేసే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ట్రంప్ తాజా వ్యాఖ్యలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే హొర్ముజ్ జలసంధి వద్ద అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్‌ను ఇరాన్ డ్రోన్‌తో కూల్చివేసిన క్రమంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

