పంచన్ లామా సమాచారం ఇవ్వండి.. చైనాను అడిగిన అమెరికా
పంచన్ లామాకు సంబంధించిన సమాచారం ఇవ్వమని అమెరికా చైనాను అడిగింది. స్వతంత్ర నిపుణుడు ఆయనను కలిసేందుకు అవకాశం ఇవ్వాలని అమెరికా సూచించింది

వాషింగ్టన్ : పంచన్ లామాకు సంబంధించిన సమాచారం ఇవ్వమని అమెరికా చైనాను అడిగింది. స్వతంత్ర నిపుణుడు ఆయనను కలిసేందుకు అవకాశం ఇవ్వాలని అమెరికా సూచించింది. దీనిపై చైనా ఇంతవరకు పెదవి విప్పకపోవడం విశేషం.
టిబెటన్ల బౌద్ధ గురువు, 11 వ పంచన్ లామా ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుపాలంటూ యూఎస్ కమీషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ (యూఎస్సీఐఆర్ఎఫ్) చైనా ప్రభుత్వాన్ని కోరింది. పంచన్ లామాను కేవలం ఆరు సంవత్సరాల వయసులో చైనా ప్రభుత్వం తమ బందీగా తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అనంతరం ఆయన ఆచూకీ లేకుండా పోయింది. దీనిపై పలుసార్లు మానవ హక్కుల సంస్థలు ప్రశ్నిస్తున్నప్పటికీ చైనా మాత్రం పెదవి విప్పడం లేదు. పంచన్ లామా విషయంలో చైనా పట్ల కఠినంగా వ్యవహించాలని యూఎస్సీఐఆర్ఎఫ్ అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసింది. దలైలామా తర్వాత టిబెటన్ బౌద్ధ గురు అయిన పంచన్ లామాను కలవడానికి స్వతంత్ర నిపుణుడిని అనుమతించాలని యూఎస్సీఐఆర్ఎఫ్ కమిషనర్ నాడిన్ మెన్జా డిమాండ్ చేశారు.
టిబెటన్ల బౌద్ధ గురువుగా 1989 ఏప్రిల్ 14 న గెలైన్ చోకి నిమాను 11 వ పంచన్ లామాగా దలైలామా ప్రకటించారు. 1989 ఏప్రిల్ 25 న జన్మించిన గెలైన్ను చైనా ప్రభుత్వం 1995 మే 15 న ఆయన ఆరేండ్ల వయసులో అపహరించిందని మెన్జా ఆరోపించారు. అప్పటి నుంచి 11 వ పంచన్ లామా, అతని కుటుంబం గురించి ఎవరికీ సమాచారం లేదు. చైనా ప్రభుత్వం 32 వ ఏర్పాటు దినోత్సవం సందర్భంగా గెలైన్ చోకి నిమాను విడుదల చేయాలని యుఎస్సీఐఆర్ఎఫ్ గత నెలలో డిమాండ్ చేసింది.
ఇలాఉండగా, బౌద్ధ మత స్వేచ్ఛపై ఆగ్రహంతో ఉన్న చైనా.. లాసాలో ‘సాగా దావా’ అనే మత మాసంలో ఎటువంటి మతపరమైన కర్మలు చేయవద్దంటూ చైనా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలు బుధవారం నుంచి అమలులో ఉన్నాయి. ఈ కాలాన్ని బౌద్ధులు చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ సమయంలో ఎటువంటి పూజలు చేయవద్దని చైనా వారిపై నిషేధం విధించింది.
ఇవి కూడా చదవండి..
ఎల్లుండి నుంచి హీరో బైకుల ఉత్పత్తి ప్రారంభం
స్పైస్‌జెట్ నిర్వాకం.. రోజంతా పైలట్లకు జాగారం..
100 పడకల కొవిడ్ కేంద్రం ఏర్పాటులో నటి జాక్వెలిన్ బిజీ
టీకాలు తీసుకున్నా.. మాస్క్‌లు మరువొద్దు : డాక్టర్ రణదీప్ గులేరియా
ఆధునిక హంగులతో రాజధానిని నిర్మిస్తున్న ఈజిప్ట్
“మీ ప్రియమైన వారి చేయి వదలకండి”: టీనా అంబానీ సందేశం
తెరపైకొచ్చిన మిక్కీ మౌస్.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బోనస్ ప్రకటించినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అందని నగదు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
Singireddy Niranjan Reddy | రేవంత్ అసమర్థతో హరిగోస పడుతున్న రైతాంగం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Iron Rod Pierces Boy’s Mouth | ఆడుతూ కిందపడిన బాలుడు.. నోటిలోకి చొచ్చుకెళ్లిన ఇనుప కడ్డీ
Nishad Kumar: ఏషియన్ పారా గేమ్స్.. లాంగ్ జంప్‌లో నిషాద్ కుమార్‌కు స్వర్ణం
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

